శనివారం 04 జూలై 2020
Nipuna-education - Jun 02, 2020 , 23:51:24

గ్రంథ పాలకులు

గ్రంథ పాలకులు

లైబ్రరీలు నాలెడ్జ్‌, ఇన్ఫర్మేషన్‌ల రిజర్వాయర్లు. సప్త సముద్రాలకు మించిన సమాచారాన్ని  నిక్షిప్తం చేసే ప్రదేశాలు గ్రంథాలయాలు. ఆ గ్రంథాలయాలను సమర్థంగా నిర్వహించడం, సమాచారాన్ని పొందిగ్గా  అమర్చడం, అడిగిన వెంటనే కావాల్సిన సమాచారాన్ని అందించడం అనుకున్నంత సులభమేమీ కాదు. అందుకే ఈ  లక్షణాలు, నైపుణ్యాలు అందించేందుకు రూపొందించిన కోర్సు లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌. ఈ కోర్సు గురించి నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం.

లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అనేది ఇంటర్‌ డిసిప్లినరీ ఫీల్డ్‌. సమాచార  నిర్వహణ, సాంకేతికత, విద్య, ఇతర ప్రాంతాల అభ్యాసాలు, దృక్పథాలు, సాధనాలు గ్రంథాలయాలకు వర్తిస్తుంది. లైబ్రేరియన్‌ అంటే గ్రంథపాలకులు లైబ్రరీల సంరక్షకులు. గ్రంథాలయాల్లో పుస్తకాలను  నిర్వహించడం, నిల్వ చేయడం వారి విధి. సాంప్రదాయ గ్రంథాలయాల్లో పత్రికలు, మైక్రో ఫిల్మ్‌లు, ఆడియో-వీడియోలు, క్యాసెట్లు, విద్య, పరిశోధనకు సంబంధించినవి ఉంటాయి. 

గ్రంథాలయాలు రకాలు 

పౌర గ్రంథాలయాలు

అకడమిక్‌ గ్రంథాలయాలు- స్కూల్‌, కాలేజీ, యూనివర్సిటీ

ప్రత్యేక గ్రంథాలయాలు- పరిశోధన కోసం, జాతీయ  గ్రంథాలయాలు. 

పుస్తకాలు, మ్యాగజైన్‌లు, జర్నల్స్‌ నిర్వహించడం, మెయింటెయిన్‌ చేయడం వంటివి లైబ్రరీ సైన్సెస్‌లో నేర్పిస్తారు. లైబ్రరీకి వచ్చే వ్యక్తులకు అవసరమైన సమాచారాన్ని వర్గీకరించడం, నాలెడ్జ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌ చేయడం అనేది వీరి జాబ్‌ ప్రొఫైల్‌లో భాగం. క్లాసిఫికేషన్‌/కేటగిరీ సిస్టమ్స్‌, రచనా వ్యాసంగం, డాక్యుమెంటేషన్‌, ప్రిజర్వేషన్‌ అండ్‌  కన్జర్వేషన్‌ ఆఫ్‌ మ్యానుస్క్రిప్ట్‌, కలెక్షన్‌ మేనేజ్‌ మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీ, రిసెర్చ్‌ మెథడాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, రిఫరెన్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్‌, ఆర్కైవ్స్‌ మేనేజ్‌ మెంట్‌, ఇండెక్సింగ్‌, లైబ్రరీ ప్లానింగ్‌ మొదలైనవి కోర్సులో నేర్పిస్తారు.

వినూత్నంగా ఆలోచించేవారికి, సహనం ఉన్నవారికి ఈ కోర్సు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అరల్లో పుస్తకాలను అందంగా అమర్చడానికి వినూత్నంగా ఆలోచించాలి. అడిగిన వెంటనే విసుక్కోకుండా అవసరమైన పుస్తకాన్ని అందించాలి. 

హైదరాబాద్‌సిటీ సెంట్రల్‌ లైబ్రరీలోలక్షల్లో పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి తనకు కావాల్సిన పుస్తకం కోసం గంటలకొద్దీ అన్వేషించాలి. అందుకే వీరికి లైబ్రేరియన్‌ సహాయం అవసరం. 

కోర్సు స్వరూపం

సాధారణంగా లైబ్రరీ సైన్స్‌ కోర్సులో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌, క్లాసిఫికేషన్‌, క్యాటలాగింగ్‌ సిస్టమ్స్‌, బిబ్లియోగ్రఫీ, డాక్యుమెంటేషన్‌, మెయింటెనెన్స్‌ అండ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ మ్యానుస్క్రిప్ట్‌, లైబ్రరీ మేనేజ్‌మెంట్‌, రిసెర్చ్‌ మెథడాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్‌, ఆర్కైవ్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇండెక్సింగ్‌, లైబ్రరీ ప్లానింగ్‌ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది.

కోర్సులు - అర్హతలు

ప్రస్తుతం మనదేశంలో 80కి పైగా యూనివర్సిటీలు లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ కోర్సును అందిస్తున్నాయి. ఇవి అందించే కోర్సులు సర్టిఫికెట్‌ నుంచి పీహెచ్‌డీ వరకు ఉన్నాయి. 

సర్టిఫికెట్‌ కోర్సుఇన్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (C.L.I.Sc.): కాలవ్యవధి ఆరు  నెలలు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (B.L.I.Sc.). కాలవ్యవధి ఒక సంవత్సరం. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులు.

మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (M.L.I.Sc.). కాలవ్యవధి రెండేండ్లు. సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులు.

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌(PGDDIM)-OU/లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ (PGDLAN)- University of  hydera bad. కాలవ్యవధి ఒక సంవత్సరం. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులు.

PhD: UGC- NET/SET/JRF-3 to 5 years

కోర్సులు అందిస్తున్న సంస్థలు 

తెలుగు రాష్ర్టాల్లో దాదాపు అన్ని వర్సిటీలు ఈ లైబ్రరీ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా వర్సిటీలు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష లేదా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. 

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) కూడా లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ కోర్సులు అందిస్తుంది.

Documentation Research Training Centre- Banglore, వెబ్‌సైట్‌: https://drtc.isibang.ac.in/courses/ms-lis

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ రిసోర్సెస్‌ (NISCAIR), వెబ్‌సైట్‌: www.niscair.res.in

బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి. వెబ్‌సైట్‌:www.bhu.ac.in

ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ

మద్రాస్‌ విశ్వవిద్యాలయం, చెన్నై

Mysore university,Mysore

University of Tamilnadu

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం, ఆగ్రా

గుల్బర్గా  విశ్వవిద్యాలయం, గుల్బర్గా

ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్‌ విశ్వవిద్యాలయం, ముంబై

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ, న్యూఢిల్లీ (దూర విద్య)

ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

SV  University, తిరుపతి

20. SK University, అనంతపురం.

ఉపాధి అవకాశాలు

ప్రభుత్వ గ్రంథాలయాలు

విశ్వవిద్యాలయాలు/ కళాశాలలు / పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు

ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా

లైబ్రరీ అటెండెంట్‌ లైబ్రరీ అసిస్టెంట్‌ సెమీ ప్రొఫెషనల్‌, అసిస్టెంట్‌ జూనియర్‌ లైబ్రేరియన్‌ / ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌,  డిప్యూటీ లైబ్రేరియన్‌ లైబ్రేరియన్‌ / చీఫ్‌ లైబ్రేరియన్‌ పరిశోధకులు / శాస్త్రవేత్తలు / అప్లికేషన్‌ స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్‌ / రిఫరెన్స్‌ లైబ్రేరియన్‌ క్యాటలాగ్‌ / టెక్నికల్‌ అసిస్టెంట్‌ / రికార్డ్స్‌ మేనేజర్‌ డైరెక్టర్‌ / ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ హెడ్‌, ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ సీనియర్‌ ఇన్ఫర్మేషన్‌ అనలిస్ట్‌ సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ లా లైబ్రేరియన్‌ ఇండెక్సర్‌ ఇన్ఫర్మేషన్‌ ఆర్కిటెక్ట్‌ ఆర్కివిస్ట్‌ ఎల్‌ఐఎస్‌ నిపుణులు కూడా ప్రైవేట్‌ పబ్లిషింగ్‌ హౌసెస్‌, ఇతర ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగం చేయాలని  కోరుకుంటారు.

విదేశీ  రాయబార కార్యాలయాలు, జాతీయ స్థాయి మ్యూజియాలు, పురాతత్వ శాఖలు, కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌, డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌), ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) వంటి సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

లైబ్రేరియన్‌ నిపుణుల జీతాలు వారి వ్యక్తిగత అర్హతలు, అనుభవం, పరిమాణం, నియామక సంస్థల స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉన్నతమైన రికారు,్డ అధిక అర్హతలు ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాలు సాధిస్తారు. కళాశాల, విశ్వవిద్యాలయ గ్రంథాలయాల్లో జీతాలు ఉపాధ్యాయులతో పోల్చవచ్చు. వాస్తవం చెప్పాలంటే పత్యేక లైబ్రేరియన్లకు జీతాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రభుత్వ మ్యూజియం, ఆర్కైవ్‌, గ్యాలరీల్లో పనిచేసే లైబ్రేరియన్లు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నారు. పరిశోధనా సంస్థలు, ప్రైవేట్‌ డాక్యుమెంటేషన్‌ కేంద్రాల్లో పనిచేసే లైబ్రేరియన్లకు మంచి వేతనాలు లభిస్తున్నాయి.

కార్పొరేట్‌  సెక్టార్‌లో..

లైబ్రరీ సైన్స్‌ కోర్సు ఉత్తీర్ణులకు కార్పొరేట్‌ సంస్థలు సైతం రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో వీరి అవసరం రోజురోజుకు పెరుగుతుంది. విస్తృతమైన సమాచారాన్ని పొందిగ్గా అమర్చడానికి సంబంధిత విభాగంలో సుశిక్షుతులైన సిబ్బంది అవసరం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో ఆయా సంస్థల నిరంతర  కార్యకలాపాలైన డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌, వెబ్‌ కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌, ఇంటర్నెట్‌ కోఆర్డినేషన్‌ వంటి విభాగాల్లో లైబ్రరీ సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలున్నాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ 1959లో ఏర్పాటు చేశారు.

MLISC-మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, కోర్స్‌ వ్యవధి 2 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్‌.

PGDDIM-పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, 1సంవత్సరం

Ph.D పీహెచ్‌డీ ఇన్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, పరిశోధన 3-5 ఏండ్లు.

100 మల్టిపుల్‌ ప్రశ్నలు, 100 మార్క్స్‌, బుక్స్‌-రచయితలు, జనరల్‌ నాలెడ్జి. అన్ని రంగాల్లో వర్తమాన అంశాలు అర్థమెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, అవార్డ్స్‌, సంక్షేమ పథకాలు, భారత రాజ్యాంగంపై ప్రశ్నలు వస్తాయి.

కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌

డిప్మార్ట్‌మెంట్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, దూరవిద్య(SDLC) ద్వారా BLISC- 1 సంవత్సరం

MLISC- మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ కోర్సు- 1 సంవత్సరం

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌,B.LI.SC, MLISC, MPHIL, Ph.D కోర్సులను దూరవిద్య ద్వారా అందిస్తుంది.

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.

PGDLAN-పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ లైబ్రరీ ఆటోమేషన్‌ నెట్‌వర్కింగ్‌, 1 సంవత్సరం కోర్సు.

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన సైన్స్‌, 6 నెలలు. అర్హత  ఇంటర్‌


logo