ఆదివారం 12 జూలై 2020
Nipuna-education - Jun 02, 2020 , 23:28:26

వినూత్న కోర్సుల విశిష్ట వేదిక

వినూత్న కోర్సుల  విశిష్ట వేదిక

ఐఐఎస్‌ఈఆర్‌లో బీఎస్‌-ఎంఎస్‌ డిగ్రీ విద్యార్థుల్లో  భిన్న ఆలోచనలు ఉంటాయి. వాటిని సరైన దారిలో నడిపిస్తే వారు అబ్దుల్‌ కలాం, శ్రీనివాస రామానుజన్‌లుగా అవుతారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా దేశంలో పరిశోధనలతో ముడిపడిన చదువుల కొరత తీర్చడానికి కేంద్రం ప్రారంభించిన విశిష్ట విద్యాలయాలు ఐఐఎస్‌ఈఆర్‌లు. వీటిలో ఇంజినీరింగ్‌ కానీ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కానీ మెడిసిన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ప్రారంభం నుంచే వినూత్న కరికులంతో పరిశోధనాత్మకమైన కోర్సులను అందిస్తూ దేశానికి అవసరమైన శాస్త్రవేత్తల వేదికగా ఈ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐసర్‌లలో ప్రవేశాల దరఖాస్తు గడువు జూన్‌ 10తో ముగియనున్న నేపథ్యంలో ఆ సంస్థ వివరాలు సంక్షిప్తంగా..

ఐఐఎస్‌ఈఆర్‌: సైన్స్‌ ఎడ్యుకేషన్‌, రిసెర్చ్‌ రంగాలను మిళితం చేసి అత్యున్నత విద్యను అందించడానికి కేంద్రం ఐఐఎస్‌ఈఆర్‌లను ఏర్పాటు చేసింది. మొదట 2006లో కోల్‌కతా, పుణెలలో ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఏడు ఐసర్‌లు ఉన్నాయి.

ఐసర్‌ క్యాంపస్‌లు: భోపాల్‌, బెర్హంపూర్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్నాయి.

ఆఫర్‌ చేస్తున్న కోర్సులు: బీఎస్‌, బీఎస్‌-ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ.

బీఎస్‌ డిగ్రీ- ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ కోర్సులను కేవలం భోపాల్‌ క్యాంపస్‌ మాత్రమే అందిస్తుంది. ఇది నాలుగేండ్ల కోర్సు.

బీఎస్‌-ఎంఎస్‌ డిగ్రీ ఐదేండ్ల డిగ్రీ కోర్సు. 

ఈ కోర్సులు పూర్తి రెసిడెన్షియల్‌ ఫుల్‌టైం కోర్సులు.

అర్హతలు: 2019/2020లో ఇంటర్‌ (సైన్స్‌ స్ట్రీమ్‌)ఉత్తీర్ణులు. ఆయా రాష్ట్ర బోర్డుల్లో టాప్‌ -20 పర్సంటైల్‌లో ఉండాలి.  

గమనిక: మన రాష్ట్ర అభ్యర్థులు 500 మార్కులకు జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌-467, ఓబీసీ-ఎన్‌సీఎల్‌-464, ఎస్సీ-453, ఎస్టీ-457, పీహెచ్‌సీ-453 మార్కులు వచ్చిన వారు ఐఏటీ రాయడానికి అర్హులు.

స్కాలర్‌షిప్‌లు: కేవీపీవై చానెల్‌ వారికి నిబంధన ప్రకారం కేవీపీవై స్కాలర్‌షిప్‌ ఇస్తారు. మిగిలిన రెండు చానెల్‌ విద్యార్థులకు పరిమిత సంఖ్యలో డీఎస్‌టీ అందిచే ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.

రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌.

ప్రవేశాలు కల్పించే విధానం

మూడు విధానాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంక్‌, స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ బోర్డుల చానెల్‌ ద్వారా. 

1. కేవీపీవై ఫెలోషిప్‌ 2020-21 విద్యాసంవత్సరం నుంచి పొందనున్నవారికి.

2. ఐఐటీ -జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)లో 10 వేల ర్యాంక్‌లోపు వచ్చినవారికి.

3. స్టేట్‌, సెంట్రల్‌ బోర్డ్‌లలో ఐఐఎస్‌ఈఆర్‌ ప్రకటించిన కటాఫ్‌ మార్కులు సాధించినవారు సంస్థ నిర్వహించే ఐఐఎస్‌ఈఆర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఐఏటీ) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

ముఖ్యతేదీలు 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరితేదీ: జూన్‌ 10 (సాయంత్రం 5 గంటల వరకు)

నోట్‌: కేవీపీవై, ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ చానెళ్ల ద్వారా ప్రవేశానికి సంబంధించిన తేదీల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

వెబ్‌సైట్‌: https://www. iiseradmission.in

పూర్తి వివరాల కోసం 

The Chairperson Joint Admissions Committee 2020

Indian Institute of Science Education & Research Thiruvananthapuram

Maruthamala PO, Vithura,Thiruvananthapuram 

Pin code - 695551,Kerala, India.

Email: [email protected]

Phone : 0471-2778200, 0471-2778182 (10:00 AM - 02:00 PM)

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ


logo