ఆదివారం 17 జనవరి 2021
Nipuna-education - May 07, 2020 , 02:51:08

సీఎంఐ గణిత కోర్సుల వేదిక

సీఎంఐ గణిత కోర్సుల వేదిక

గణితం.. ఏ రంగం తీసుకున్నా అన్నింటా అంతర్లీనంగా ఉండే సబ్జెక్టు. గ్రీకు మేధావుల ప్రకారం గణితంలో రాణిస్తే అన్నింటా రాణిస్తారనే భావన ఉంది. అలాంటి గణితం అంటే చాలామందికి ప్రీతి. కేవలం గణితం, కంప్యూటర్‌ కోర్సులను అందిచడమే కాకుండా పరిశోధనలకు నిలయంగా పేర్కొనే సీఎంఐలో ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ అందించే కోర్సులు, ప్రవేశ విధానం గురించి సంక్షిప్తంగా...

ఆఫర్‌ చేస్తున్న కోర్సులు- అర్హతలు

బీఎస్సీ ఆనర్స్‌ 

1. మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌.  

2. మ్యాథ్స్‌ అండ్‌ ఫిజిక్స్‌

- ఇది మూడేండ్ల కోర్సు

అర్హతలు: ఇంటర్‌ ఉత్తీర్ణులు. ఇంటర్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ డేటా సైన్స్‌

అర్హతలు: 

ఎమ్మెస్సీ మ్యాథ్స్‌: డిగ్రీలో మ్యాథ్స్‌ లేదా బీస్టాట్‌ లేదా బీటెక్‌ ఉత్తీర్ణులు అర్హులు. 

 • ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌కు కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో బీఎస్సీ, బీటెక్‌ కోర్సులు చదివినవారు. 
 • ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో డిగ్రీకోర్సులు చదివినవారు అర్హులు. 

నోట్‌: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పీహెచ్‌డీ 

విభాగాలు: మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌

అర్హతలు: సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణత లేదా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

గమనిక: నేషనల్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌లో ప్రతిభ చూపినవారికి నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. 

 • అన్ని కోర్సులకూ ట్యూషన్‌ ఫీజు ప్రతి సెమిస్టర్‌కు రూ.లక్ష చెల్లించాలి. 
 • ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు మాత్రం రూ.2 లక్షలు. 
 • మెరిటోరియస్‌ స్టూడెంట్స్‌కు ప్రతి నెలా రూ.5000 ఫెలోషిప్‌ కింద చెల్లిస్తారు. 
 • ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.6000 ఫెలోషిప్‌ ఇస్తారు. 
 • పీహెచ్‌డీ కోర్సులకు ఎంపికైనవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 తర్వాత రెండేళ్లు రూ.35,000 చొప్పున చెల్లిస్తారు.

ప్రవేశాలు ఎలా?

 • డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 • పీజీ, పీహెచ్‌డీలకు ఇంటర్వ్యూలూ ఉంటాయి. 
 • పీహెచ్‌డీ కంప్యూటర్‌ సైన్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులకు జాయింట్‌ ఎంట్రెన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (జెస్ట్‌) స్కోర్‌తో నేరుగా ఇంటర్వ్యూ అవకాశం కల్పిస్తారు.

పరీక్ష విధానం

 • రెండు బీఎస్సీ కోర్సులకూ పరీక్ష ఉమ్మడిగానే నిర్వహిస్తారు. 
 • ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. 
 • పరీక్ష వ్యవధి 3 గంటలు. పార్ట్‌- ఏలో కనీస పాయింట్లు సాధిస్తే పార్ట్‌-బీ మూల్యాంకనం చేస్తారు. 
 • ప్రశ్నలన్నీ ఇంటర్‌ మ్యాథ్స్‌ నుంచే ఇస్తారు.
 • ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోసం నిర్వహించే పరీక్షల్లోనూ రెండు పార్టులుంటాయి. 
 • ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. 
 • ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ ప్రశ్నలు మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ నుంచి అడుగుతారు. 

నోట్‌: పాత ప్రశ్నపత్రాలు సీఎంఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్‌, అలహాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, కాలికట్‌, చండీగఢ్‌, చెన్నై, కోయంబత్తూర్‌, ఢిల్లీ, గోవా, గువాహటి, హైదరాబాద్‌, ఇంఫాల్‌, ఇండోర్‌, కాన్పూర్‌, కోల్‌కతా, మధురై, ముంబై, నాగ్‌పూర్‌, పాట్నా, పుణె, రాంచీ, షిల్లాంగ్‌, సిల్చార్‌, శ్రీనగర్‌, త్రివేండ్రం.

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.. చివరితేదీ: మే 20

పరీక్షతేదీ: జూన్‌లో ఉంటుంది. త్వరలో వెల్లడిస్తారు.

వెబ్‌సైట్‌: https://www.cmi.ac.in

చిరునామా: Chennai Mathematical Institute, The Registrar, Chennai Mathematical Institute, H1, SIPCOT IT Park, Siruseri, Kelambakkam 603103. Phone: (044) 2747 0226 Email: [email protected]

చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌


 • చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌. దీన్ని 1989లో సదరన్‌ పెట్రోకెమికల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (స్పిక్‌) ప్రారంభించింది. 1996 నుంచి ఇది స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించింది. ఈ సంస్థ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో ప్రముఖ వ్యక్తులు ఉంటారు. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంలోని సంస్థల్లో ఇదొక ఉత్తమ సంస్థగా నిలిచింది. 
 • 1998 నుంచి ఈ సంస్థను చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌గా పిలుస్తున్నారు.
 • సీఎంఐకు 2006లో యూజీసీ యూనివర్సిటీ హోదాను కల్పించింది.
 • ఇక్కడ ప్రధానంగా మ్యాథ్స్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఫిజిక్స్‌కు సంబంధించిన పరిశోధనలు జరుగుతాయి. దీంతోపాటు డిగ్రీ, పీజీ కోర్సులను కూడా సంస్థ అందిస్తుంది.
 • మ్యాథమేటికల్‌ సైన్సెస్‌ కోర్సుల్లో దేశంలో బోధన, పరిశోధనలకు అగ్రగామి సంస్థగా సీఎంఐని చెప్పుకోవచ్చు.
 • ఇక్కడి విద్యార్థులు దేశీయంగానే కాకుండా ప్రపంచస్థాయి సంస్థల్లో బోధన, పరిశోధనలో గొప్ప అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.
 • ఇక్కడ కోర్సులన్నీ రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు.


-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ