గురువారం 02 జూలై 2020
Nipuna-education - Apr 09, 2020 , 00:21:55

మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌

మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌

 • @ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌

పరిశ్రమల్లో అవసరమైన సిబ్బందితోపాటు వాటిని మేనేజ్‌ చేయగల మానవ వనరులు కూడా అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న మేనేజ్‌మెంట్‌ చదివినవారు అవసరం. వీటికి అవసరమైన నిపుణులను అందించేందుకు ఏర్పడిందే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ). 2020-22కు గాను ఐపీఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు.. 

 • మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లో పరిశోధన, అభివృద్ధి కోసం ఏర్పాటైన సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ). ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్నది. మేనేజ్‌మెంట్‌, సోషల్‌ సైన్సెస్‌లలో ఉన్నత విద్యా కోర్సులైన డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీలను ఐపీఈ అందిస్తుంది. దీనికి ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌  ఎడ్యుకేషన్‌   (ఏఐసీటీఈ) గుర్తింపు ఉంది. ఐపీఈ అందించే ఎంబీఏ, తత్సమాన కోర్సులను ఏఐయూ (అసోసియేషన్‌ ఆఫ్‌  ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) గుర్తించింది. ఈ కోర్సులకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రెడిటేషన్‌ గుర్తింపు కూడా ఉంది.
 • ఓయూకు అనుబంధంగా, విద్య, శిక్షణ, పరిశోధనే లక్ష్యంగా ఐపీఈని నాన్‌ ఫ్రాఫిట్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీగా 1964లో స్థాపించారు. ఈ సంస్థ పబ్లిక్‌ సెక్టార్‌, ప్రైవేట్‌ కంపెనీలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తుంది. ఐపీఈ రెండేండ్ల పీజీ కోర్సులతోపాటు ఎంబీఏ, డాక్టోరల్‌ కోర్సులను నిర్వహిస్తుంది. వివిధ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

కోర్సులు

 • పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (జనరల్‌)
 • పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)
 • పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌)
 • పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (మార్కెటింగ్‌)
 • పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌)
 • పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎగ్జిక్యూటివ్‌)

ఆధునిక బిల్డింగ్‌లు

 • ఒకప్పుడు ఓయూలో ఉన్న ఐపీఈని ఆధునిక మౌలిక వసతులతో హైదరాబాద్‌ నగర శివారులోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేశారు. క్లాసులు, హాస్టళ్లలో సెంట్రలైజ్డ్‌ ఏసీ సౌకర్యం కల్పించారు. ఐపీఈ బిల్డింగులను చూస్తే త్రీ స్టార్‌ హోటళ్లలాగా కనిపిస్తాయి. దీనిలో చదువుతోపాటు ఆటలకు కూడా సమప్రాధాన్యం ఇస్తున్నారు. క్రికెట్‌ నెట్స్‌,   షటిల్‌ కోర్టులు, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌బాల్‌ గ్రౌండులు ఉన్నాయి. 


అపార అనుభమున్న ప్రొఫెసర్లు

 • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరికులమ్‌ను ఐపీఈ అనుసరిస్తుంది. ఇండస్ట్రీలో అపార అనుభమున్న ఫ్రొఫెసర్లు ఉండటం దీని ప్రత్యేకత. ఫ్యాకల్టీలు విద్యార్థులతో ఫ్రెండ్లీగా మెలుగుతూ వారిలో నైపుణ్యాన్ని పెంచుతారు. 10 మంది స్టూడెంట్లకు ఒక మెంటార్‌ ఉంటారు. వీరు కోర్సు ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు విద్యార్థులను గైడ్‌ చేస్తుంటారు.
 • ఐపీఈ వివిధ అంశాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తుంది. ఇందులో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూఎన్‌ఐడీపీ), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కామన్వెల్త్‌ సెక్రటేరియట్‌, డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (డీఎఫ్‌ఐడీ), గవర్నమెంట్‌ ఆఫ్‌ యూకే, ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోషన్‌ (ఐసీపీఈ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగ వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. దీంతోపాటు ప్రభుత్వాలు వివిధ విభాగాలు, మున్సిపల్‌ సేవలు, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాల్లో చేపట్టవలసిన సంస్కరణలను గురించి అధ్యయనం చేస్తుంది. ఐపీఈ                                            భారత ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కొత్తగా తీసుకురావాల్సిన            సంస్కరణలకు సంబంధించి కన్సల్టెన్సీగా కొనసాగుతున్నది. 
 • దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్‌ 15
 • పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌: http:www.ipeindia.orgను సందర్శించండి.

అర్హతలు

 • ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జీమ్యాట్‌, క్యాట్‌, మ్యాట్‌, గ్జాట్‌, ఏటీఎంఏ(అగ్రికల్చర్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ) ఏదో ఒక దాని స్కోర్‌ తప్పనిసరిగా ఉండాలి. టాప్‌ స్కోర్‌ ఉన్నవారికి రూ.2 లక్షల వరకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కూడా  లభిస్తుంది.

90 శాతం ప్లేస్‌మెంట్స్‌

 • ఈ ఐపీఈ ఏటా 90 శాతం ప్లేస్‌మెంట్స్‌ సాధిస్తుంది. టీసీఎస్‌, ఐసీఐసీఐ, డెలాయిట్‌, ట్రినిటీ, నౌకరీ, క్యాపిటల్‌ ఫస్ట్‌ వంటి సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సెలక్షన్‌లో ఐపీఈ విద్యార్థులను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. సుమారు రూ.5.5 లక్షల నుంచి 10 లక్షల వరకు వార్షిక వేతనంతో ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. డెలాయిట్‌ కంపెనీ ట్యాక్సేషన్‌ రిస్క్‌మేనేజ్‌మెంట్‌ అండ్‌ బ్రాండ్‌ ప్రొటెక్షన్‌, ఎంగేజ్‌మెంట్‌ కంట్రోలర్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లోని అభ్యర్థులకు వందకు వంద శాతం అవకాశాలు కల్పిస్తుంది.  

-సత్యం చాపల


logo