గురువారం 04 జూన్ 2020
Nipuna-education - Feb 12, 2020 , 03:52:47

కరెంటు అఫైర్స్

కరెంటు అఫైర్స్

Telangana

దేశంలో రెండో అతిపెద్ద మెట్రో

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు నిర్మించిన 11 కి.మీ. మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వద్ద సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 7 ప్రారంభించారు. దీంతో దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండో అతిపెద్ద మెట్రోరైల్‌ నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ మెట్రో అవతరించింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్‌ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.


జీఎస్‌ఐ డైరెక్టర్‌గా శ్రీధర్‌

భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ (జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా-జీఎస్‌ఐ) డైరెక్టర్‌గా ఎం శ్రీధర్‌ ఫిబ్రవరి 3న బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు జీఎస్‌ఐ దక్షిణ ప్రాంతం అదనపు జనరల్‌గా శ్రీధర్‌ పనిచేశారు. 1986లో జీఎస్‌ఐలో చేరిన ఆయన హిమాలయాలు మొదలుకొని దక్షిణ భారత ద్వీపకల్పం వరకు భూవైజ్ఞానిక రంగంలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు. వజ్రాల అన్వేషణలో ఆయన అసాధరణ తోడ్పాటు అందించినందుకు కేంద్రం నేషనల్‌ జియో సైన్స్‌ అవార్డును శ్రీధర్‌కు అందజేసింది.


టీవోఏ అధ్యక్షుడిగా జయేశ్‌

ఫిబ్రవరి 9న జరిగిన తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీవోఏ) ఎన్నికల్లో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ విజయం సాధించారు. కే రంగారావుపై ఆయన 13 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీవోఏ ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో జగదీశ్వర్‌ యాదవ్‌ గెలిచారు. ఉపాధ్యక్షులుగా ఎస్‌ వేణుగోపాలాచారి, రఫత్‌ అలీ, ప్రేమ్‌రాజ్‌, సరల్‌ తల్వార్‌, జాయింట్‌ సెక్రటరీలుగా సోమేశ్వర్‌, మల్లారెడ్డి, రామకృష్ణ, నార్మన్‌ ఇసాక్‌ ఎన్నికయ్యారు. National


రామాలయ నిర్మాణ కమిటీ

అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పర్యవేక్షణకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర’ పేరుతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న లోక్‌సభలో ప్రకటించారు. దీనిలో 9 మంది శాశ్వత, 6గురు నామినేటెడ్‌ సభ్యులు మొత్తం 15 మంది ఉంటారు. మాజీ సొలిటర్‌ జనరల్‌ కేశవ్‌ అయ్యంగార్‌ పరాశరణ్‌ చైర్మన్‌గా నియమితులైన ఈ కమిటీలోకి ఒక దళితుడిని కూడా తీసుకున్నారు. ఈ కమిటీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాశ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు.


11వ డిఫెన్స్‌ ఎక్స్‌పో

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ 11వ డిఫెన్స్‌ ఎక్స్‌పో-20ని ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న ప్రారంభించారు. రానున్న ఐదేండ్లలో భారత్‌ నుంచి 500 కోట్ల డాలర్ల (రూ.35.6 వేల కోట్లు) విలువైన మిలిటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ డిఫెన్స్‌ ఎక్స్‌పోను రెండేండ్లకోసారి నిర్వహిస్తారు. ఐదురోజుల పాటు జరిగిన ఈ డిఫెన్స్‌ ఎక్స్‌పోకు 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరయ్యారు.


International


ఆస్కార్‌ అవార్డులు

లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఫిబ్రవరి 10న 92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 

ఉత్తమ చిత్రం: పారాసైట్‌

ఉత్తమ నటుడు: జోక్విన్‌ ఫీనిక్స్‌ (జోకర్‌)

ఉత్తమ నటి: రెనీ జెల్‌వెగర్‌ (జూడి)

ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్‌పిట్‌ (వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌)

ఉత్తమ సహాయ నటి: లారా డెర్న్‌ (మ్యారేజ్‌ స్టోరీ)

ఉత్తమ దర్శకుడు: బాంగ్‌ జూన్‌-హో (పారాసైట్‌)

ఉత్తమ సంగీతం: హిలార్డ్‌ (జోకర్‌)

ఉత్తమ మ్యూజిక్‌ ఒరిజినల్‌ సాంగ్‌: ఐయామ్‌ గోన్నా.. లవ్‌ మీ అగైన్‌ (రాకెట్‌ మ్యాన్‌)

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పారాసైట్‌ (దక్షిణ కొరియా)

మేకప్‌ అండ్‌ హెయిర్‌ ైస్టెలింగ్‌: బాంబ్‌ షెల్‌

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: జాక్వెలిన్‌ డురన్‌ (లిటిల్‌ ఉమెన్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫీచర్‌: అమెరికన్‌ ఫ్యాక్టరీ

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: టైకా వైటిటి (జోజో ర్యాబిట్‌)

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ-4

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: అమెరికన్‌ ఫ్యాక్టరీ

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌: ది నైబర్స్‌ విండో

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: పారాసైట్‌ (బాంగ్‌ జూన్‌-హో)

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌: లెర్నింగ్‌ టు స్కేట్‌బోర్డ్‌ ఇన్‌ ఏ వార్‌ జోన్‌ (ఇఫ్‌ యూ ఆర్‌ ఏ గర్ల్‌)

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌: హెయిర్‌ లవ్‌

ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వీ ఫెరారీ

ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: 1917

ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌: 1917 (రోచ్‌రాన్‌, గ్రెగ్‌ బట్లర్‌, డొమినిక్‌ తువే)

ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ (డొనాల్డ్‌ సిల్వెస్టర్‌

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌

పారాసైట్‌ కేన్స్‌ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకున్న తొలి దక్షిణ కొరియా చిత్రంగా రికార్డు సృష్టించింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ‘గోల్డెన్‌ గ్లోబ్‌' పురస్కారం అందుకున్న తొలి కొరియన్‌ చిత్రంగానూ ఘనత సాధించింది. 


మత స్వాతంత్య్ర కూటమి

ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడం అలయన్స్‌ (అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి)గా ఫిబ్రవరి 5న ఏర్పాటయ్యాయి. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ కూటమి ప్రారంభమైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్‌, నెదర్లాండ్స్‌, గ్రీస్‌ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్యదేశాలుగా చేరాయి. మత స్వాతంత్య్రాన్ని గౌరవించి, పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని కూటమి ప్రతినబూనింది.


Persons


అంతరిక్షంలో క్రిస్టినా కోచ్‌ రికార్డ్‌

అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన నాసా మహిళా వ్యోమగామి క్రిస్టినా హేమాక్‌ కోచ్‌ ఫిబ్రవరి 6న సురక్షితంగా భూమికి చేరుకుంది. ఆమె 328 రోజులపాటు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించింది. రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన సోయజ్‌ కమాండర్‌ అలెగ్జాండర్‌ స్కొవోర్ట్‌, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ల్యూకా పర్మిటానోతో కలిసి ఆమె కజకిస్థాన్‌లో ఓ మారుమూల పట్ణంలో దిగారు. 2019, మార్చి 14న సోయజ్‌ ఎంఎస్‌-12 స్పేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా క్రిస్టినా కోచ్‌ రోదసి ప్రయాణం ప్రారంభించింది. ఆమె తన రోదసి ప్రయాణంలో ఆరు స్పేస్‌వాక్‌లు చేశారు. అంతరిక్ష కేంద్రం బయట 42 గంటల 15 నిమిషాలు చేశారు. పెగ్గీవిట్సన్‌ 2016లో అంతరిక్ష కేంద్రంలో 288 రోజులు గడిపారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా సోవియట్‌ యూనియన్‌కు చెందిన వాలెంటీనా తెరిష్కోవా (1963) చరిత్రలో నిలిచారు.


హెచ్‌ఏఎల్‌ సీఈవోగా అమితాబ్‌ భట్‌

ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సీఈవో (చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌)గా అమితాబ్‌ భట్‌ ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఈ సంస్థకు చెందిన లైట్‌ యుటిలిటీ హెలికాప్టర్‌ (ఎల్‌యీహెచ్‌) ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అమితాబ్‌ సేవలందించారు. రక్షణ రంగానికి కామోవ్‌ కేఏ-226టీ హెలికాప్టర్లను అందించడం కోసం కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ ఇండో రష్యన్‌ హెలికాప్టర్స్‌ లిమిటెడ్‌కు ఈయన డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.


ఇరాక్‌ ప్రధానిగా అల్లావి

ఇరాక్‌ నూతన ప్రధానిగా మహ్మద్‌ తౌఫిక్‌ అల్లావి ఫిబ్రవరి 4న బాధ్యతలు స్వీకరించారు. అదెల్‌ అబ్దుల్‌ మహదీ రాజీనామా చేయడంతో అల్లావి ప్రధానిగా నియమితులయ్యారు.


బ్రిటన్‌ హైకమిషనర్‌ సర్‌ ఫిలిప్‌

భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌గా సర్‌ ఫిలిప్‌ బార్టన్‌ ఫిబ్రవరి 6న నియమితులయ్యారు. ప్రస్తుత రాయబారి సర్‌ డొమినిక్‌ ఆస్కిత్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రస్తుతం విదేశీ, కామన్వెల్త్‌ కార్యాలయంలో కాన్సులర్‌-సెక్యూరిటీ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1994లో ఢిల్లీలోని బ్రిటన్‌ రాయబార కార్యాలయంలో ఫస్ట్‌ సెక్యూరిటీగా పనిచేశారు.


Sports


గోల్డెన్‌ గర్ల్‌ బాక్సింగ్‌

స్వీడన్‌లోని బోరస్‌లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన గోల్డెన్‌ గర్ల్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు ఆరు స్వర్ణాలతో సహా మొత్తం 14 పతకాలను సాధించారు. జూనియర్‌ విభాగంలో 5 బంగారు, 3 రజతాలు, 1 కాంస్యం సాధించారు. యూత్‌ విభాగంలో 1 బంగారు. 4 కాంస్యాలు గెలుచుకున్నారు. ఓవరాల్‌ చాంపియన్‌షి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. జూనియర్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రాచీ (50- కేజీలు) ‘బెస్ట్‌ బాక్సర్‌' అవార్డును గెలుచుకుంది. 


స్పియర్స్‌పై ఐటీఎఫ్‌ నిషేధం

డోపింగ్‌లో పట్టుబడినందుకు అమెరికాకు చెందిన మహిళల టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ అబిగెయిల్‌ స్పియర్స్‌పై అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) 22 నెలలపాటు నిషేధం విధిస్తున్నట్లు ఫిబ్రవరి 6న ప్రకటించింది. 2019 యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సందర్భంగా స్పియర్స్‌కు నిర్వహించిన డోపింగ్‌ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు ప్రాస్టీరోన్‌, టెస్టోస్టిరాన్‌ వాడినట్లు తెలింది. డోపింగ్‌ ఫలితాలు వచ్చిన తేదీ 2019, నవంబర్‌ 7 నుంచి ఈ నిషేధం అమలవుతుందని 2021, సెప్టెంబర్‌ 6 వరకు కొనసాగుతుందని ఐటీఎప్‌ తెలిపింది.


బంగ్లాదేశ్‌దే అండర్‌-19 ప్రపంచకప్‌

అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్‌ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలో ఫిబ్రవరి 9న జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ భారత జట్టుపై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ జట్టు 177 పరుగులు చేసింది. 170 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ జట్టు వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం విజేతగా నిలిచింది. అక్బర్‌ అలీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు లభించాయి.  • వేముల సైదులు
  • జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు
  • ఆర్‌సీ రెడ్డి  స్టడీ సర్కిల్‌ ,హైదరాబాద్‌


logo