ప్రతీ శుక్రవారం మాదిరే ఈ వారం కూడా చాలా కొత్త సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. ఒకటి రెండు కాదు.. మార్చి 5న ఏకంగా 9 సినిమాలు విడుదలయ్యాయి. అందులో మూడు నాలుగు సినిమాలలో మాత్రమే తెలిసిన నటులు ఉన్నారు.. మిగిలిన సినిమాలు అంతా కొత్తవాళ్లతోనే తెరకెక్కాయి. అవి విడుదలవుతున్నాయని నిర్మాతలు చెప్పేంత వరకు తెలియని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఈ వారం వచ్చిన 9 సినిమాలలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలేంటి.. ఏది విజేతగా నిలిచింది అనేది చూద్దాం..
SK25 అంటూ హడావిడి చేసిన ఈ చిత్రానికి టాక్ ఊహించినంత రాలేదు. స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సిన ఎమోషన్ మిస్ అయిందంటున్నారు ఆడియన్స్.
సీరియస్ కథతో వచ్చినా కూడా స్క్రీన్ ప్లే లోపాలతో పవర్ లెస్ ప్లేగా మారిపోయింది ఈ చిత్రం.
ఈ వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్ తెచ్చుకున్న చిన్న సినిమా ఇది. హరిప్రసాద్ జక్కా తెరకెక్కించిన ఈ చిత్రం టైమ్ కనెక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.
చక్రవాకం సీరియల్ హీరో సాగర్ నటించిన ఈ సినిమాకు టాక్ చాలా బాగుంది. అయితే ప్రమోషన్ చేసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంది.
దేశాన్ని దోచేసిన వ్యాపార వేత్తల కారెక్టర్స్ నుంచి స్పూర్తి పొంది తెరకెక్కిన సినిమా క్లైమాక్స్. రాజేంద్రప్రసాద్ నటించిన ఈ చిత్రం మెప్పించడంలో విఫలమైంది.
సైన్స్ ఫిక్షన్ గా వచ్చిన ఈ చిత్రానికి టాక్ చాలా బాగుంది. కాకపోతే ప్రమోషన్ కరువు అయిపోయింది.
ఈ సినిమా విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు.
తెలుగు సినిమాల హడావిడిలో హాలీవుడ్ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.
ఈ ఓటీటీ సినిమా కాస్త ల్యాగ్ అయిందనే టాక్ తెచ్చుకుంది.