e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ తెలంగాణ సాహిత్యం

తెలంగాణ సాహిత్యం

కాకతీయులు
కాకతీయుల్లో మొదటి ప్రోలరాజు కాలం (1052-76) నుంచి తెలుగు భాషకు ఆదరణ పెరిగింది. ఇతని కొడుకు రెండో బేతరాజు మొదటిసారి తెలుగులో శాసనాలు వేయించాడు.
రెండో ప్రోలరాజు మాటేడు శాసనం వేయించాడు. ఇది కాకతీయుల మొదటి గద్య పద్యాత్మక శాసనం.
రుద్రదేవుడు (ప్రతాపరుద్రుడు) తెలుగులో నీతిసారం రచించాడు.
నోట్‌: మానపల్లి రామకృష్ణ సంస్కృతంలో నీతిసారం రాశాడు
బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి రచించాడు.
మడికి సింగన సకలనీతి సమ్మతం రచించాడు
వినుకొండ వల్లభమాత్యుడు క్రీడాభిరామం రచించాడు.
జాయపసేనాని నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి సంస్కృతంలో రాశాడు. పాకాల చెరువు శాసనం, కలువ కొలను శాసనాలు వేయించాడు.
నోట్‌: 1. కాకతీయ గణపతి దేవుని బావమరిది అయిన జాయపసేనాని గజ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించాడు.
2. తెలుగు వారిలో నృత్యానికి సంబంధించిన లక్షణ గ్రంథం (నృత్య రత్నావళి) రాసిన మొదటివాడు జాయపసేనాని.
అచ్యుతేంద్ర యతి వేయి స్తంభాల గుడి (హన్మకొండ) శాసన నిర్మాత.

బ్రహ్మశివకవి
మెదక్‌ జిల్లా పటాన్‌చెరు గ్రామానికి చెందినవాడు. ఈయన త్రైలోక్య చూడామణి, సమయ పరీక్ష, ఛత్తీస్‌ రత్నమాల అనే గ్రంథాలు రచించాడు.
పాల్కురికి సోమనాథుడు (1160-1240)
ఉమ్మడి వరంగల్‌ జిల్లా పాలకుర్తి పాల్కురికి జన్మస్థలం.
తల్లిదండ్రులు శ్రియాదేవి, విష్ణురామదేవుడు. గురువు గురులింగార్యుడు.
బిరుదులు ప్రథమాంధ్ర విప్లవకవి, దేశీకవితోద్యమ పితామహుడు.
పాల్కురికి సోమన తెలంగాణ తెలుగు సాహిత్యంలో ఆదికవి.
తెలుగులో తొలిసారిగా జీవిత చరిత్ర రాసింది కూడా పాల్కురికి సోమనాథుడు అని చరిత్రకారుల అభిప్రాయం.
ఈ రచనల ద్వారా ఆ కాలం నాటి తెలంగాణ సాంఘిక జీవితాన్ని శూద్రకులాలకు చెందిన వారి ఆచార, వ్యవహారాలను కళ్లకు కట్టినట్లు చూపారు.

- Advertisement -

విశ్వేశ్వర దేశికుడు (1200-90)
కాకతీయ గణపతి దేవుని దీక్షా గురువు
గణపతి దేవుని నుంచి మందరం అనే గ్రామాన్ని, రుద్రమదేవి నుంచి వెలగపూడి అనే గ్రామాన్ని పొందాడు. ఈ రెండు గ్రామాలను కలిపి గోళగి అనే అగ్రహారంగా మార్చి అక్కడ శివాలయం, ప్రసూతి వైద్యశాల నిర్మించాడు.

శివదేవయ్య
పురుషార్థసారం, శివదేవధీమణిశతకం అనే గ్రంథాలు రచించాడు
ఇతన్ని సంస్కృతాంధ్ర కవితాపితామహుడు అంటారు.
గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు దగ్గర మంత్రిగా పనిచేశాడు.

ఈశ్వర భట్టోపాధ్యాయుడు (13వ శతాబ్దం కాలానికి చెందినవాడు)
ఈయన బూదపుర శాసన నిర్మాత.
ఈ శాసనం మహబూబ్‌నగర్‌లో ఉంది.
ఈ శాసనంలో చిత్రకవిత కనిపిస్తుంది.

కుప్పాంభిక (1230-1300)
ఈమె గోన బుద్ధారెడ్డి కూతురు.
బూదపురం శాసనం వేయించింది.
ఈమెను తొలి తెలుగు తెలంగాణ కవయిత్రిగా పేర్కొంటారు.

చక్రపాణి రంగనాథుడు

 1. శివభక్తి దీపిక 2. గిరిజాది నాయక శతకం
 2. చంద్రాభరణ శతకం 4. శ్రీగిరినాథ విక్రయం
 3. సంస్కృతంలో వీరభద్ర విజయం

నోట్‌: తెలుగులో పోతన వీరభద్రవిజయం రచించాడు.
కపర్థి- (13-14 శతాబ్దం)

ఇతని రచనలు

 1. అపస్తంబ శ్రేత సూత్ర భాష్యం 2. భరద్వాజ గృహ్య సూత్ర భాష్యం
 2. అపస్తంభ గృహ్య సూత్ర పరిష్టం భాష్యం 4. శ్రేత కల్పకావృత్తి
 3. దివ్వ పూర్ణ భాష్యం

నోట్‌: మెదక్‌ జిల్లా కొలిచెలిమెకు చెందిన కపర్థి తండ్రి మల్లినాథసూరి. కపర్థి కుమారుడు ప్రసిద్ధ కవి పెద్దభట్టు.
గండయ్య భట్టు
శ్రీహర్షుని ఖండ పద్యానికి వ్యాఖ్యానం రాశాడు.

గంగాధర కవి
మహాభారతాన్ని నాటకరూపంలో రచించాడు

అప్పయార్యుడు
‘జినేంద్ర కళ్యాణాభ్యుదయం’ రచించాడు.

మంచన

‘కేయూరబాహుచరిత్ర’ రచించాడు.

శేషాద్రి రమణ కవులు
యయాతి చరిత్ర, ఉషా రాగోదయం నాటకాన్ని తెలుగులో రచించాడు.
నోట్‌: పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్రను ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో తెలుగులో రచించాడు.

మారన (1289-1323)
మార్కేండయ పురాణం (తెలుగులో తొలి పురాణం. అష్టాదశ పురాణాల్లో ఏడోది. రుషి పేరుతో ఉన్న ఏకైక పురాణం. దీన్ని రెండో ప్రతాప రుద్రసేనాధిపతి నాగయగన్ననికి అంకితమిచ్చాడు)

కేతన
ఆంధ్రభాషాభూషణం (తెలుగులో మొదటి వ్యాకరణ గ్రంథం)
విజ్ఞానేశ్వరీయం (తెలుగులో మొదటి ధర్మశాస్త్ర గ్రంథం)
సంస్కృతంలో దండిన్‌ రచించిన దశకుమార చరిత్రను తెలుగులోకి కేతన అనువదించి దానిని తిక్కనకు అంకితం ఇచ్చాడు.
నోట్‌: కేతనను అభినవ దండిగా అభివర్ణిస్తారు.
మార్కండేయ పురాణాన్ని (తొలి తెలుగు పురాణం) రచించిన మారన, కేతన, తిక్కన సమకాలికులు.
విద్యానాథుడు ( 1289-1323)
ప్రతాపరుద్ర యశోభూషణం (అలంకార శాస్త్ర గ్రంథం), ప్రతాపరుద్ర కల్యాణం (నాటకం) గ్రంథాలు రచించాడు.
నోట్‌: ప్రతాపరుద్రయశోభూషణం గ్రంథాన్ని రామరాజ భూషణుడు ‘నరసభూపాలీయం’గా అనువాదం చేశాడు.
కుమారస్వామి సోమపీఠి రత్నాపణ రచించాడు.
చిలుకమర్రి తిరుమలాచార్యులు రత్నశాఖ రచించాడు.
నోట్‌: రత్నశాఖ ఆధారంగా భట్టుమూర్తి ‘నరసభూపతీయం’ రచించాడు.

అగస్త్యుడు (1289-1323)
1. బాలభారతం
2. కృష్ణచరిత్ర (గద్యకావ్యం)
3. నలకీర్తి కౌముది (పద్యకావ్యం)
4. మణి పరీక్ష లక్ష్మీస్ర్తోత్రం
5. లలిత సహస్రనామం
6. శివసంహిత
7. శివస్తవం తదితర 74 గ్రంథాలు రచించాడు.

గోనా బుద్ధారెడ్డి (1210-40) బిరుదులు: కవికల్పతరువు, కవిలోకభోజుడు
తొలి తెలుగు రామాయణమైన ‘రంగనాథరామాయణం’ రచించాడు.
ఇతని తండ్రి విఠల రంగనాథుని పేరుతో ఈ రామాయణం రాశాడు.
ఇతను వర్ధమానపురం రాజు గోనగన్నయరెడ్డి దత్తపుత్రుడు విఠలరెడ్డి కుమారుడు.
గోన బుద్ధారెడ్డి పూర్వ రామాయణం యుద్ధకాండ వరకు రాయగా అతని కుమారులు కాచవిభుడు, విఠలనాథుడు ఉత్తర రామాయణం రచించారు.
నోట్‌: తెలుగులో తొలి జంటకవులు కాచవిభుడు, విఠలనాథుడు.
రెండో ప్రతాపరుద్రుని మంత్రి శరభాంకుడు శరభాంకలింగ శతకాన్ని రచించాడు.
గణపనారాధ్యుడు యోగశాస్ర్తాన్ని ద్విపదలో స్వరశాస్త్రం పేరుతో రచించాడు.

నరసింహుడు (1289-1323)
రుక్చాయ, కాకతీయ చరిత్ర, మలయవతి అనే గ్రంథాలు రచించాడు.

విశ్వనాథుడు (1315 కాలం)
సౌగంధికాపహరణం అనే సంస్కృత వ్యాయోగం, సాహిత్య దర్పణం (అలంకార శాస్త్ర గ్రంథం) రచించాడు.

రావిపాటి త్రిపురాంతకుడు
సంస్కృతంలో ప్రేమాభిరామం రచించాడు. త్రిపురాంతకోదాహరణం, మదనవిజయం, చంద్రతారావళి, అంబికా శతకం వంటి రచనలు చేశాడు.

నోట్‌: ప్రేమాభిరామాన్ని అనుసరించి వినుకొండ వల్లభరాయలు క్రీడాభిరామం రచించాడు.
కాసె సర్వప్ప- సిద్దేశ్వర చరిత్రను రచించాడు.
కొలని రుద్రదేవుడు- రాజారుద్రీయం, శ్లోకవర్తికం (వ్యాకరణం) గ్రంథాలు రచించాడు.
అప్పన మంత్రి- చారుచర్య, వైద్యగ్రంథం రచించాడు.
యథావాక్కుల అన్నమయ్య- సర్వేశ్వర శతకం
కృష్ణమాచార్యుడు- సింహగిరి, నరహరి (వచనాలు) గ్రంథాలు రచించాడు.

చక్రపాణి రంగనాథుడు
శివ భక్తి దీపిక, చంద్రాభరణ శతకం, శ్రీగిరినాథ విక్రయం, గిరిజాది నాయక శతకం, వీరభద్రవిజయం (సంస్కృతం)
నోట్‌: వీరభద్ర విజయం సంస్కృత గ్రంథాన్ని పోతన తెలుగులో రచించాడు.

భాస్కర రామాయణం
భాస్కర రామాయణాన్ని నలుగురు కవులు రాశారు. వీరిలో ప్రధానమైన కవి హుళక్కి భాస్కరుడు. అందుకే రామాయణాన్ని భాస్కర రామాయణం అంటారు.
భాస్కరుడు అరణ్యకాండం, యుద్ధకాండ పూర్వ భాగం, భాస్కరుని కొడుకు మల్లికార్జునభట్టు బాలకాండం, కిష్కింధ, సుందరకాండం భాస్కరుని శిష్యుడు రుద్రదేవుడు (ప్రతాపరుద్రుడు) అయోధ్యకాండం, భాస్కరుని మిత్రుడు అయ్యలార్యుడు యుద్ధకాండంలోఉత్తరభాగం రచించాడు.
నోట్‌: 1. తెలుగులో చంపూ రూపంలో (పద్య, గద్య) వెలువడిన తొలి రామాయణ కావ్యం.

 1. ఈ కావ్యాన్ని రెండో ప్రతాపరుద్రుని అశ్వసేనాధిపతి అయిన సాహిణి మారనకు అంకితమిచ్చాడు.

తిక్కన
మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.
ఇతను తెలుగులో రాసిన నిర్వచనోత్తర రామాయణాన్ని రెండో మనుమసిద్దికి అంకితమిచ్చాడు.
ఇతని బిరుదులు: కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు

నోట్‌: 1. నన్నయ: రాజరాజనరేంద్రుని ఆస్థానం
2. తిక్కన: గణపతిదేవుని ఆస్థానం
3. ఎర్రన: ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం
నన్నయ, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురిని కవిత్రయం అంటారు.

తెలుగు రచనలు

 1. బసవ పురాణం 2. పండితారాధ్య చరిత్ర
 2. వృషాధిప శతకం 4. చతుర్వేద సారం
 3. బసవోదాహరణం 6. బసవరగడ
 4. శ్రీ బలవాఢ్య రగడ 8. గంగోత్పత్తి రగడ
  9.చెన్నమల్లు సీసములు 10. పండితారాధ్యోపహరణం
 5. అనుభవసారం (తొలికృతి) 12. సహస్రగణమాలిక
  సంస్కృత రచనలు
 6. సోమనాథ భాష్యం 2. వృషభాష్టకం
 7. రుద్ర భాష్యం 4. త్రివిధ లింగాష్టకం
 8. బసవోదాహరణం
  కన్నడ రచనలు-
 9. బసవలింగ నామావళి 2. సద్గురు రగడ
 10. శీల సంపాదన 4. కుమ్మరి గుండయ్య కథ
 11. బెజ్జమహాదేవి 6. మాడేలు మాచెయ్య కథ
 12. మాదరి చెన్నయ్య కథ 8. కన్నడ బ్రహ్మయ్య కథ
 13. పిట్టవ్వ కళ 10. శివగణ సహస్రనామాలు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement