తెలంగాణలో ఎక్కువ భాగం ఏ మృత్తికలు విస్తరించి ఉన్నాయి? 1) ఎర్ర మృత్తికలు 2) నల్లరేగడి మృత్తికలు 3) ఒండ్రు మృత్తికలు 4) లాటరైట్ మృత్తికలు
లాటరైట్ మృత్తికల నిర్మాణం ఏ ప్రక్రియ వల్ల జరుగుతుంది? 1) ఎక్కువ లోతులో శైథిల్య ప్రక్రియ 2) నదుల వల్ల కొట్టుకొచ్చి మేటవేసిన మన్ను ప్రక్రియ 3) ధూళిరూపంలో గాలిద్వారా కొట్టుకొచ్చి మేటవేసిన మన్ను ప్రక్రియ 4) పైవన్నీ
నల్ల మృత్తికలను ఏ విధంగా వర్గీకరించవచ్చు? 1) లోతైన నల్లని మృత్తికలు 2) మధ్యస్థ నల్లని మృత్తికలు 3) వర్గీకరించని నల్లని మృత్తికలు 4) పైవన్నీ
‘తనను తాను దున్నుకునే నేలలు’ అని ఏ మృత్తికలను అంటారు? 1) నల్లరేగడి మృత్తికలు 2) ఎర్ర మృత్తికలు 3) ఒండ్రు మృత్తికలు 4) లాటరైట్ మృత్తికలు
రాళ్లు రప్పలతో కూడి సేంద్రియ పదార్థ అవశేషాలకు మూలమైన భూ ఉపరితల భాగాన్ని ఏమంటారు? 1) మృత్తికలు 2) బీడు భూములు 3) మైదానాలు 4) పంపాలు
అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా గుర్తించారు? 1) 1965 2) 1972 3) 1978 4) 1982
కింది వాటిలో మంచిర్యాల జిల్లాలో గల ఉభయారణ్యం ఏది? 1) కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం 2) శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం 3) ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం 4) పైవన్నీ
రాష్ట్రంలో అతిపురాతనమైన అభయా రణ్యం ఏది? 1) మంజీరా అభయారణ్యం 2) కిన్నెరసాని అభయారణ్యం 3) కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం 4) ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం