హిస్సార్: ఓ సామాజిక వర్గాన్ని దూషించారనే కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు హరియాణాలోని హన్సీ పోలీసులు శనివారం అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం కొద్దిసేపటికే యువీని బెయిల్‌పై విడుదల చేశారు. గతేడాది ఓ క్రికెటర్‌పై అభ్యంతరకర వ్యాఖ్య లు చేశారనే ఆరోపణలతో యువరాజ్‌పై కేసు నమోదైంది.