లక్నో : మోడలింగ్ చేసేందుకు అవకాశం ఇస్తామని ఆశచూపి యువతి (23)పై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలోని విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరగ్గా ఇవాళ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు సోహుం, ప్రియాంశ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ యువతికి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు.
గురువారం ఆమెకు ఫోన్ చేసి మోడలింగ్ చేసేందుకు అవకాశం ఇస్తామంటూ నమ్మించి నగర శివారులోని నిలాంజన్ గెస్టుహౌజ్కు రప్పించారు.
అనంతరం ఇద్దరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని లక్నో అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ మాలిక్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
కేసు దర్యాప్తు చేస్తున్నామని.. వైద్య నివేదిక రాగానే అందుకు అనుగుణంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు కమిషనర్ పేర్కొన్నారు.