Xiaomi 12T | గ్లోబల్ మార్కెట్లలోకి చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ 12టీ, 12 టీ ప్రో వేరియంట్లను తీసుకొచ్చింది. రెండింటిలోనూ వేర్వేరు చిప్సెట్లు, డిఫరెంట్ ప్రెమరీ కెమెరాలు మినహా అన్ని ఫీచర్లు ఒక్కటే. షియోమీ 12టీ ప్రో..749 యూరోల ( దాదాపు రూ.60,641)కు లభిస్తుంది. షియోమీ 12 టీ.. 599 యూరోల (సుమారు రూ.48,475)కు లభ్యం అవుతుంది.
ఈ నెల 13 నుంచి యూరప్ దేశాల్లో ఎంపిక చేసిన మార్కెట్లలో అధికారిక చానళ్ల ద్వారా షియోమీ 12టీ-12టీ ప్రో ఫోన్ల విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపింది. భారత్ మార్కెట్లో ఎప్పుడు లభిస్తుంది, దాని ధర ఎంత అన్నది ప్రకటించలేదు. క్వాల్కామ్`స్ టాప్ ఆఫ్ ది లైన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ వన్ చిప్, 12 గిగ్స్ రామ్ తదితర ఫీచర్లు ఉంటాయి.
శ్యామ్‌సంగ్ ఐసోసెల్ హెచ్‌పీ-1 200 ఎంపీ సెన్సర్‌తో కూడిన 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, వన్ ఇన్‌సైడ్‌లో మోటరోలా ఎడ్జ్ 30 ఆల్ట్రా 200ల కెపాసిటీ గల కెమెరా ఉన్నాయి. 8కే వీడియోలను రికార్డు చేయగల సామర్థ్యం దీని సొంతం. హార్మన్ కార్డొన్ బ్రాండెడ్ స్టీరియో స్పీకర్లు, ప్లే బ్యాక్ డొల్బీ విజన్ కంటెంట్ వంటి ఫీచర్లు ఉంటాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 8100-ఆల్ట్రా చిప్సెట్, 8 గిగ్స్ రామ్ వంటి ఫీచర్లు షియోమీ 12టీలో ఉంటాయి. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా కూడా లభిస్తుంది. ఈ ఫోన్లో ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సార్ కూడా పొందొచ్చు.