జగిత్యాల : బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి వారిని ఆదివారం ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు సాదరంగా ఆహ్వానించి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. బీర్పూర్ ఆలయ పరిసర ‘ధర్మపురి’ చిత్రం షూటింగ్ జరుగుతుండగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శేఖర్ మాస్టర్‌ను చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.