World Photography day | మెడలో కెమెరా వేసుకుని.. రోడ్డుపై వచ్చే పోయేవాళ్లను ఓ కోతి ఫొటో తీస్తున్నట్లు ఉంది కదూ ! హైదరాబాద్ మహానగర సుందరీకరణలో భాగంగా ఫ్లై ఓవర్లకు, ఫుట్పాత్ పక్కన ఉన్న గోడలకు జీహెచ్ఎంసీ అందమైన బొమ్మలతో రంగులు దిద్దుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరంలోని రహదారి పక్కన ఉన్న ఓ గోడకు కెమెరాతో ఫొటోను క్లిక్మనిపిస్తున్నట్లు ఉన్న ఒక కోతి బొమ్మను చిత్రించారు. అయితే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నాడు విశేషంగా ఆకట్టుకుందీ దృశ్యం.