e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

అప్‌సర్జ్‌ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌, మార్చి 10 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మూడేండ్ల కిందట వీ-హబ్‌ను ప్రారంభించిందని గుర్తుచేశా రు. ఆస్ట్రేలియా, వీ-హబ్‌ ఏర్పాటుచేసి న ‘అప్‌సర్జ్‌’ కార్యక్రమాన్ని కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తున్నదని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వీ-హబ్‌కు మొదటి అంతర్జాతీయ భాగస్వామి అని గుర్తు చేశారు. అప్‌సర్జ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 240 మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, వారు ఆర్థికంగా ఎదిగేలా సహాయం అందించనున్నారు. కార్యక్రమంలో భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారి హెచ్‌ఈ బెర్రీ ఓ ఫర్రెల్‌, సౌత్‌ ఇండియా ఆస్ట్రేలియా కౌన్సుల్‌ జనరల్‌ సారా కిర్లా, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, వీహబ్‌ సీఈవో దీప్తి రావుల పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement