ఇంట్లో పడున్న డొక్కు కారు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ కారు లైసెన్స్ ప్లేటు నెంబరుతో ఒక లాటరీ కొన్నదా 43 ఏళ్ల అమెరికా మహిళ. ఫుడ్ స్టాప్ మినీ మార్ట్లో ఆమె కొన్న పిక్-5 లాటరీ నెంబరుకు 50 వేల డాలర్లు తగిలినట్లు మేరీల్యాండ్ లాటరీ అధికారులు తెలిపారు. ఒక్క డాలరు పెట్టి ఆమె కొన్ని ఈ లాటరీ తన జీవితాన్ని మార్చేసిందని సదరు మహిళ సంతోషం వ్యక్తం చేస్తోంది.
రెండు సార్లు ఆ నెంబరు చెక్ చేసుకున్న తర్వాత తల్లికి ఈ విషయం చెప్పానని, తనకు లాటరీ తగిలిందన్న నిజాన్ని నమ్మలేకపోయానని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ డబ్బుతో తన ముగ్గురు పిల్లలు, ఒక మనవడికి బహుమతులు కొంటానని, కొన్ని బిల్లులు చెల్లించి, తన కారు రిపేర్ చేయించుకుంటానని వెల్లడించింది. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆ కారు ఆమె లక్కీ కారు అంటూ అభినందిస్తున్నారట.