బ్యాంకాక్ : మాజీ బాయ్ ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు గతంలో తాను అతడికి బహుమతిగా ఇచ్చిన బైక్‌ను మహిళ దగ్ధం చేసిన ఘటన థాయ్‌లాండ్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం బ్యాంకాంక్‌లోని స్కూల్ పార్క్‌లో టూ వీలర్‌పై మహిళ కనోక్ వాన్ (36) పెట్రోల్ పోసి నిప్పంటించింది. తనతో తిరిగి కలిసి ఉండేందుకు నిరాకరించడంతో మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఆమె ఈ పనికి తెగబడింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.
బైక్‌కు నిప్పంటించడంతో పక్కనే పార్క్ చేసి ఉన్న మరో ఆరు ద్విచక్రవాహనాలకూ మంటలు వ్యాపించడంతో అధికారులు అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్కూల్ బిల్డింగ్‌లోనే పార్కింగ్ ప్లేస్ ఉన్నా విద్యార్ధులు కరోనా మహమ్మారితో ఆన్లైన్ క్లాసులకు హాజరవుతుండటంతో పెనుప్రమాదం తప్పిందని స్ధానిక పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా స్కూల్ ఉద్యోగి మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మహిళను గుర్తించారు. బాయ్‌ఫ్రెండ్ బైక్‌ను దగ్ధం చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.