మహి, సోనా పాటిల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విన్నర్ ట్రిప్’. తెలుగు శ్రీను దర్శకుడు. యస్.యస్.సి. క్రియేషన్స్ పతాకంపై సంపత్శ్రీను, కె.లక్ష్మణ్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశాంక్ భాస్కరుని స్వరాల్ని అందించారు. ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘విన్నర్ ట్రిప్‌కు సెలెక్ట్ అయిన బ్యాచ్ గోవాకు వెళితే అక్కడ ఓ ముఠా చేతిలో ఇరుక్కొని వారు ఎలాంటి కష్టాలు పడ్డారు? చివరకు ఎలా భయటపడ్డారన్నదే చిత్ర కథ’ అని చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. రవికుమార్, శ్రీకర్, ప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహేష్ మట్టి, సంగీతం: శశాంక్ భాస్కరుని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను తెలుగు.