ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు చెందిన వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇవాళ ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దాంతో బంగ్లాదేశ్ జట్టు తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ పేరిట ఉంది. షకీబ్ 2009లో జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ తరఫున అదే అత్యంత వేగవంతమైన సెంచరీగా ఉన్నది. ఇవాళ ఆ రికార్డును రహీమ్ బద్దలు కొట్టాడు.