ఐపీఎల్లో చాలాకాలంగా మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్.. ఇటీవల సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారత జట్టుకు ఎంపికైనా ఎక్కువగా బెంచ్‌కే పరిమితమైన అర్షదీప్.. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో కూడా తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
అతని ప్రదర్శనపై వెటరన్ పేసర్, స్వింగ్ సుల్తాన్‌గా పిలిచే భువనేశ్వర్ కుమార్ ప్రశంసలు కురిపించాడు. ఆటలో ఏది అవసరమో అర్షదీప్‌కు చాలా స్పష్టంగా తెలుసునని భువీ చెప్పాడు. ‘‘ఎలాంటి ఫీల్డ్ సెట్టింగ్స్ పెట్టాలి? ఒక్కో బ్యాటర్‌కు ఎలా బౌలింగ్ చేయాలి? అనే విషయాలు అర్షదీప్‌కు తెలుసు. చాలా తక్కువ మందిలోనే అంత మెచ్యూరిటీ కనిపిస్తుంది’’ అని భువనేశ్వర్ చెప్పాడు.
ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అర్షదీప్ 2/18 గణాంకాలతో ఆకట్టుకోగా.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.