సమరఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని ఎస్సీవో సమావేశంలో శుక్రవారం పుతిన్, మోదీ కలుసుకున్నారు. అయితే శనివారం ప్రధాని మోదీ 72వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్న విషయం పుతిన్‌కు తెలిసినా.. రష్యా అధ్యక్షుడు మాత్రం మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు. ఎందుకు తాను విషెస్ చెప్పడంలేదన్న విషయాన్ని కూడా పుతిన్ వెల్లడించారు. రేపు బర్త్‌డే జరుపుకోనున్న ప్రియతమ మిత్రుడు మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పలేకపోతున్నానని, కానీ ఇండియాకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని, మోదీ రేపు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్నా, రష్యా సంప్రదాయం ప్రకారం.. మేం ముందుగా కంగ్రాట్స్ చెప్పమని పుతిన్ అన్నారు. అందుకే ఒక రోజు ముందు మోదీకి బర్త్ డే విషెస్ చెప్పడం లేదని పుతిన్ అన్నారు. కానీ మిత్ర దేశం ఇండియాకు బెస్ట్ విషెస్ చెబుతున్నామని, మీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. అయితే ఈ యుగం యుద్ధానిది కాదని, ఇది శాంతికి చెందుతుందని పుతిన్‌తో మోదీ అన్నారు.