ఐరాస/జెనీవా, అక్టోబర్ 26: భారత్ బయోటెక్‌కు చెందిన కరోనా టీకా కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం మరికొంత ఆలస్యం కానున్నది. తుది ‘రిస్క్-బెనిఫిట్’ అంచనాను నిర్వహించేందుకు డబ్ల్యూహెచ్‌వోకు చెందిన సాంకేతిక సలహా బృందం భారత్ బయోటెక్‌ను అదనపు వివరణలను కోరింది. ఈ బృందం వచ్చే నెల 3న భేటీ అవుతుంది. కాగా, తొలుత కొవాగ్జిన్‌కు బుధవారమే డబ్ల్యూహెచ్‌వో ఆమోదం లభించనున్నదని వార్తలు వచ్చాయి.