వాషింగ్టన్: ప్రజాదరణ పొందిన చైనా యాప్స్ టిక్‌టాక్, వీచాట్‌లపై డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధించిన నిషేధాజ్ఞలను వైట్‌హౌస్ ఉపసంహరించింది. చైనా యాప్స్‌తో తమకు జాతీయ భద్రత ముప్పు ఉంటుందన్న అంశంపై సొంతంగా సమీక్షిస్తామని వైట్ హౌస్ అధికారులు బుధవారం ప్రకటించారు.
దేశ భద్రతకు ముప్పు వాటిల్లే లావాదేవీల్లో చైనా యాప్స్ పాల్గొన్న ఆధారాలపై విశ్లేషణాత్మక సమాచారాన్ని స్వీకరించాలని వాణిజ్యశాఖకు జారీ చేసిన న్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో తెలిపారు.
చైనా మిలిటరీ లేదా నిఘా వర్గాలతో అనుసంధానమైన ఈ యాప్స్ తమ యూజర్ల వ్యక్తిగత డేటా సేకరించి ఉంటారని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చైనా యాప్స్ సేకరించిన అమెరికన్ల జన్యు, వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పై వాణిజ్యశాఖ సిఫారసులు చేయనున్నది.
ఈ ఏడాది ప్రారంభంలో టిక్‌టాక్ యాప్‌పై నిషేధానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. గతేడాది వేసవి నుంచి టిక్‌టాక్‌ను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్.. దాని నుంచి అమెరికా డేటాకు ముప్పు ఉందంటూ పదేపదే నిషేధాజ్ఞలు జారీ చేశారు.
కానీ, టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను అమెరికా కోర్టులు తాత్కాలికంగా నిలిపేశాయి. ట్రంప్ ఆదేశాలను టిక్ టాక్ యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది డిస్ట్రిక్ట్ కొలంబియా సర్క్యూట్లో సవాల్ చేసింది.
దేశ భద్రతకు టిక్‌టాక్ వల్ల ముప్పు పొంచి ఉందన్న ట్రంప్ ప్రకటనను సమీక్షిస్తున్నట్లు వాణిజ్యశాఖ న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై ఈ వారాంతంలో కోర్టులో విచారణకు రానున్నది.
ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్?
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
పియాజియో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, వేరియంట్లు ఇలా..
ఫ్రాంక్లిన్పై సెబీ రూ.5 కోట్ల ఫైన్
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్.. ఎందుకంటే?!
ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తేయకుంటే పెట్రోల్ పైపైకే!
కోవిడ్ ఔషధాలపై 5 శాతానికి జీఎస్టీ మినహాయింపు? ఇంకా..!!
బిట్ కాయిన్ ఒక స్కాం.. డాలర్‌కు వ్యతిరేకం
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
జాతి వివక్ష ట్వీట్లు.. చిక్కుల్లో మరో ఇద్దరు స్టార్ ఇంగ్లండ్ క్రికెటర్లు
పీహెచ్సీలో ఆగిన రిఫ్రిజిరేటర్.. గడ్డకట్టిన 480 టీకా డోసులు