Medical Guidance | ఆడపిల్లలు కౌమారానికి చేరుకునే దశ (14-18) ఎంతో ముఖ్యమైనది. ఈ సమయంలో వాళ్లలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ లేత మనసులలో అనేక అనుమానాలు. కొందరిలో ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. ‘కొద్దిగా ఓపికపడితే అన్నీ సర్దుకుంటాయిలే’ అనుకోకుండా వారిని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాలి. చిన్నపిల్లలు కాదు కాబట్టి.. పిల్లల డాక్టరు దగ్గరికి తీసుకెళ్లలేరు. మరీ పెద్దవాళ్లు కాలేదు కాబట్టి.. గైనకాలజిస్టును సంప్రదించ లేరు. ఇలాంటి సందర్భంలో ఏ సమస్యకు ఏ డాక్టరు సలహా తీసుకోవాలనే విషయంలో నిపుణుల సూచనలు..
» దీర్ఘకాలంగా వేధిస్తున్న మధుమేహం, అధిక రక్తపోటు, ఒంటి నొప్పులకు.
» చాలాకాలం పాటు యాంటీ బయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉన్న చెవి ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధ వ్యాధులు, గొంతునొప్పి లాంటివి.
» గాయాలు, పోషక విలువల లోపాలు తదితర సమస్యలకు.
» 14 సంవత్సరాలు నిండినా రొమ్ము పరిమాణంలో మార్పులు రాకపోతే.
» యుక్త వయసు వచ్చినా రుతుక్రమం మొదలు కాకపోతే.
» నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి ఉంటే.
» లైంగిక వ్యవస్థ విషయంలో ఇతర ఇబ్బందులున్నా.
» శృంగారం, గర్భధారణ, కుటుంబ నియంత్రణలాంటి పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన విషయాలను నేరుగా చెప్పలేని సందర్భంలో.
» రొమ్ము, గర్భాశయం, అండాశయం మొదలైన భాగాలకు సంబంధించి శాస్త్రీయ అవగాహన కోసం.