టాలీవుడ్ (Tollywood) క్రేజీ సినిమాల్లో ఒకటి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే విజయవాడలో జనసేన నేతలతో సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ..తాను సినిమాలు టేకప్ చేయనని..అక్టోబర్ నుంచి మొదలయ్యే యాత్రపైనే ఫోకస్ పెడతానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు నిర్మాత ఏఎం రత్నం ప్రకారం 2023 మార్చి 30న విడుదల కానుంది హరిహర వీరమల్లు. అయితే షూటింగ్ మాత్రం ఎప్పుడూ రీస్టార్ట్ అవుతుందనేది ఏఎం రత్నం చెప్పలేదు. ఒకవేళ పవన్ చెప్పినట్టుగానే యాత్రపై ఫోకస్ పెడితే ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కడ టైం దొరుకుతుంది..? క్రిష్ మార్చి కల్లా సినిమా ఎలా పూర్తి చేయగలుగుతాడంటూ టాలీవుడ్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు.
మరి ఓ వైపు నిర్మాతగా యాక్టివ్‌గా కనిపిస్తున్నా..పవన్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు మొదలయ్యేనా..? అనేది చూడాలి మరి. హరిహర వీరమల్లు చిత్రంలో అర్జున్ రాంపాల్, నిధి అగర్వాల్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజర్.
Read Also : Hari Hara Veera Mallu | నిర్మాత యాక్టివ్..పవన్ సైలెన్స్..సినిమా పూర్తయ్యేనా..?
Read Also : Odela Railway Station Trailer | హత్యాచారం స్టోరీతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ ట్రైలర్
Read Also : Crazy News | క్రేజీ టాక్..ప్రభాస్-మారుతి సినిమా లాంఛ్ రేపే..?