Cervical Cancer | నేను ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నా. గర్భాశయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల గురించి వింటూ ఉంటాను. ముందస్తు పరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు చెబుతుంటారు. అమ్మతో సహా మా ఇంట్లో నలుగురు ఆడవాళ్లం ఉన్నాం. సాధారణంగా క్యాన్సర్ పరీక్షల్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఏ వయసు వాళ్లు పరీక్షలు చేయించుకోవాలో చెప్పగలరు.
– సోదరి
జ: క్యాన్సర్ లక్షణాలు ఉన్నా లేకపోయినా 21 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ గర్భాశయ క్యాన్సర్ ( Cervical Cancer ) పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. దీనివల్ల క్యాన్సర్ మరణాలను తగ్గించవచ్చు. 21 నుంచి 29 ఏండ్ల వయసు వారిలో గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు పాప్‌స్మియర్‌తో సర్వైకల్ సైటాలజీ స్క్రీనింగ్ చేస్తారు. దీన్ని ప్రతి మూడేండ్లకు ఒకసారి చేయించుకోవాలి. అలాగే 32 నుంచి 65 ఏండ్ల వయసు వాళ్లకు మూడేండ్లకోసారి పాప్‌స్మియర్‌తో సైటాలజీ స్క్రీనింగ్ లేదా ఐదేండ్లకోసారి ఎఫ్‌డీఏ నిర్ధారించిన హై రిస్క్ హెచ్‌పీవీ స్క్రీనింగ్ చేయాలి. 21 ఏండ్ల లోపు అమ్మాయిలకు, 65 ఏండ్లు దాటిన మహిళలకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అవసరం లేదు. గర్భాశయ క్యాన్సర్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే, ఇందులో రెండు రకాలు. పదిహేను ఏండ్ల లోపు అమ్మాయిలకు రెండు డోసులు ఉంటాయి. ఆరునెలల వ్యవధితో వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. 15 ఏండ్లు దాటినవాళ్లు మూడు డోసులు తీసుకోవాలి. జీరో డోస్, ఒకటి నుంచి రెండు నెలల మధ్య రెండో డోస్, ఆరునెలల తర్వాత చివరి డోస్ వేయించుకోవాలి. గార్డెసిల్ అనే అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది.
– డా. కావ్యప్రియ వజ్రాల,
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్.
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ
అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ… బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఎవ్వరూ అతీతులు కారు”
“క్యాన్సర్ ఎలా వస్తుంది? ఏ దశలో గుర్తిస్తే ఈ మహమ్మారి నుంచి బయటపడొచ్చు?”
“చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఇవే.. వీటిని ఇలా గుర్తించొచ్చు”
“Breast Cancer | చికిత్స అవసరం లేకుండానే ఇలా రొమ్ము కేన్సర్ నివారించవచ్చు”
“చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!