లండన్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో టీ20ల్లో 600 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ‘ది హండ్రెడ్’ టోర్నీలో నార్తర్న్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రావో గురువారం ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 29 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత రిలీ రూసోను ఎల్బీగా అవుట్ చేసిన బ్రావో తరువాత శామ్ కరన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి టీ20ల్లో 600వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.