మేషం
ఆస్తుల పంపకాలు పరిష్కారం అవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. వ్యాపారులకు అనుకూల సమయం. నూతన ఒప్పందాలు కలిసివస్తాయి.
వృషభం
పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు.
మిథునం
అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం
స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల వల్ల కార్యసిద్ధి ఉంది. ఖర్చులు పెరగవచ్చు. నలుగురికీ సాయం అందిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వారం. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి.
సింహం
కొత్త వ్యాపారం మొదలుపెట్టడంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తారు. దీర్ఘకాలిక పనుల విషయంలో ఆటంకాలు రావచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. విహారయాత్రలకు వెళ్తారు. ఇంటి మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి.
కన్య
ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సద్వినియోగం చేసుకుంటే ఈ వారం అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు. పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది.
తుల
దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరగవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఓపికతో పనులను పూర్తిచేసుకోవడం మంచిది. స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది.
వృశ్చికం
భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. నలుగురికీ సాయపడతారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైన చికాకులు ఎదురుకావచ్చు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం. భక్తి పెరుగుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ధనుస్సు
వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు తీరుతాయి. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. అలసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అప్పగించిన బాధ్యతలను సంయమనంతో నిర్వర్తిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు ఉంటాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ కాలం. కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మకరం
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. రోజువారీ వ్యాపారం కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. భూ వ్యవహారంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఓపిక అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పనిభారం పెరగడంతో అలసటకు గురవుతారు.
కుంభం
ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలను చేపడతారు. బంధుమిత్రుల సహాయంతో కార్యసాఫల్యం ఉంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయపాలన పాటించడం అవసరం.
మీనం
బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in