ఆదాయం పెరుగుతుంది. పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. పనిచేసే విధానంలో మార్పు వల్ల అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. హోదా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు తీర్పులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. ఆస్తి పంపకాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి.
శుభకార్యాలు చేస్తారు. ఇంట్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. చాలాకాలం నుంచి ఇబ్బందిపెడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. భూ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. రుణ బాధలు తీరుతాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పై చదువులకు అడ్డంకులు తొలగిపోతాయి. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అధికారుల ఆదరణ పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ పనుల్లో కొంత ఆలస్యం అవుతుంది. న్యాయ సమస్యలు తీరిపోతాయి. సమయానుకూల నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. విందులకు హాజరవుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుంబపెద్దల సూచనలు పాటించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. నలుగురికీ సాయపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంగీత, సాహిత్య కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అదృష్టం కలిసివస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు ఉంటాయి. రాజకీయ నాయకులకు ప్రజాభిమానం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి.
రావలసిన డబ్బు అందుతుంది. పనుల్లో రెట్టింపు శ్రమ అవసరం. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఇంటి మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరుతారు. దైవకార్యాలకు ఆర్థికంగా తోడ్పడుతారు. కొత్త పనులు మొదలుపెట్టకుండా, చేతిలో ఉన్న వాటిని పూర్తిచేయడం మంచిది. అన్నదమ్ముల వల్ల మేలు కలుగుతుంది. అనవసరమైన చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వ్యాపార భాగస్వాముల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఆస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు పలకరిస్తాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కొన్ని భూ తగాదాలు ముందుకువస్తాయి. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసివస్తుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో పెద్దల సూచనలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగులు ఉత్సాహంతో పనులు చేస్తారు. అధికారుల ఆదరణ పొందుతారు. పాత పనులు మళ్లీ చేపడతారు. రోజువారీ వ్యాపారాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
శ్రమ అధికమైనప్పటికీ చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది. రుణ బాధలు పెరగవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. భూ లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. అయితే, ఆర్థిక విషయాల్లో ఇతరుల జోక్యం లేకుండా జాగ్రత్త వహించండి. సమయస్ఫూర్తితో మెలగడం అవసరం. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులు అధికారుల మనసు గెలుచుకుంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో సంతృప్తి ఉన్నప్పటికీ, ఆర్థికంగా అనుకున్నంత లాభం ఉండకపోవచ్చు.
కుటుంబసభ్యులతో కలిసి విందులకు వెళతారు. కొత్త పరిచయాల వల్ల పనులు నెరవేరుతాయి. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరం. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం మంచిది. పురాణ ప్రవచనాలకు హాజరవుతారు. పనులపై శ్రద్ధ నిలుపుతారు. ఆస్తి వ్యవహారాల్లో సంయమనం అవసరం. భూ లావాదేవీల్లో లాభం పొందుతారు. సహోద్యోగులతో విభేదాలు ఏర్పడవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఏర్పడినా, బంధువర్గం సహకారంతో వాటినుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. నలుగురికీ సాయపడతారు.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల వల్ల రాబడి పెరుగుతుంది. అలసట లేకుండా పనులు పూర్తిచేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. న్యాయ సమస్యలు తీరుతాయి. దైవ దర్శనానికి ప్రాధాన్యమిస్తారు. రోజువారీ కార్యకలాపాలు ఓ మోస్తరుగా కొనసాగుతాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అంత అనుకూలమైన సమయం కాదు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు సత్ఫలితాలు సాధిస్తారు.
రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ప్రయత్నాలు ఫలించి, కొత్త ఉద్యోగంలో చేరతారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. దాయాదులతో ఇబ్బందులు ఉండవచ్చు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు వెళ్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. భూ వ్యవహారాల్లో కాలయాపన ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలం. ప్రయాణాలు వాయిదాపడతాయి. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారితో స్నేహం పెరుగుతుంది.
కుటుంబసభ్యుల సహకారంతో పనులు నెరవేరుతాయి. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఊహించని లాభాలతో ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. వ్యాపార లావాదేవీలు విజయవంతంగా కొనసాగుతాయి. పాత సమస్యలు తీరడంతో కొంత ఊరట లభిస్తుంది. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేపడతారు. బంధుమిత్రుల సహకారంతో కార్య సాఫల్యం ఉంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. సమయపాలన లేకపోవడం వల్ల ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. వారాంతంలో శుభవార్త వింటారు.
పురాణ ప్రవచనాలకు, సాహిత్య సభలకు హాజరవుతారు. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త అవకాశాలను ఒడిసిపట్టుకుంటారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.