ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. అయితే భూముల కొనుగోలు, వాహనం విషయంలో ఏమరుపాటు తగదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ పనులు కలిసివస్తాయి.
పలుకుబడి పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులకు అనువైన సమయం కాదు. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరగవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అధికారుల అండతో సమస్యలను అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ
అవసరం. గతంలో నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. రాజకీయ నాయకులకు ఆదరణ పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
మంచి ఉద్యోగంలో చేరతారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబ పెద్దల సహాయం లభిస్తుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఓపికతో పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసులలో విజయం మీదే. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంగా వ్యవహరిస్తారు. పనులపై మనసు నిలుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. బాకీల వసూలులో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల తీర్పులు వెలువడుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం అవసరం. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో పనులు చేస్తారు. రాజకీయ ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. పెద్దల సూచనలను నిర్లక్ష్యం చేయకండి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది.
రాజకీయ పనులు కలిసివస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. శ్రమ పెరుగుతుంది. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. సంయమనం పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు ఆదరణ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేయడానికి ఆర్థిక వనరులు సమకూరుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వివాదాలలోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.
బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. ప్రారంభించిన పనులలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదల, ఏకాగ్రత అవసరం. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు కలిసివస్తుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
రచయితలకు మంచి అవకాశం. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సూచనలను పాటించి, సత్ఫలితాలను పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు ఏకాగ్రత, పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తిచేస్తారు. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.
అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఉత్సాహంగా ఉంటూ, సంతృప్తిగా పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశం. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు చేసే ఆలోచన ఉంటుంది. ఆదాయం స్థిరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల ద్వారా రాబడి వస్తుంది.
వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. అందరితో చర్చించి, సమయానుకూల నిర్ణయాలను తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు కలిసివస్తుంది. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆఫీసులో అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విహారయాత్రలు చేస్తారు.