ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాల ప్రయత్నాలకు అనుకూల సమయం. నిర్మాణాలు చేపడతారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన వారం. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది.
కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. సహోద్యోగులతో సంయమనం పాటించడం అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కృతం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రభుత్వ, రాజకీయ పనులు ముందుకు సాగుతాయి. అధికారుల ఆదరణ పొందుతారు. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. రోజువారీ వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. న్యాయపరమైన చిక్కులు తీరుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదలతో ముందుడుగు వేయండి. ఖర్చుల నియంత్రణ అవసరం.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల అవసరం. వ్యాపారస్తులకు అనుకూలం. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతంగా ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటూ, పనులపై మనసు నిలుపుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యత ఉన్నప్పటికీ, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. అందరి సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం.
ఇంటా, బయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కార్యసాఫల్యం ఉంది. అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పలుకుబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు పనులలో కొంత జాప్యం జరగవచ్చు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. విందులకు హాజరవుతారు.
ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పాత బాకీల వసూలులో వివాదాలు ఏర్పడవచ్చు. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనులు పూర్తికావడంలో జాప్యం జరగవచ్చు. వారాంతంలో మేలు జరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వాహనాలు, భూముల విషయంలో ఖర్చులు ముందుకువస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఆత్మీయులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. సంయమనం పాటించాలి.
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులలో శ్రమ పెరగవచ్చు. పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కోర్టు పనుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణతో కార్యసాఫల్యం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి మూలంగా స్థానచలనం ఉంటుంది. రాజకీయ పనులు కలిసివస్తాయి. ప్రభుత్వ పనులలో విజయం చేకూరుతుంది. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన సమస్యలు తీరుతాయి. స్నేహితులు, బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త దుస్తులు, కొత్త వస్తువులు కొంటారు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. వ్యాపారులకు మంచి సమయం. కొత్త ఒప్పందాలు కలిసివస్తాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. రాబడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
బంధువుల సహకారం లభిస్తుంది. భూ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ, అందుకు తగ్గ ఫలితాలు పొందుతారు. నలుగురికి సాయపడతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు.