e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News మాకు 365 మహిళా దినోత్సవాలు

మాకు 365 మహిళా దినోత్సవాలు


ఓ తెలంగాణ ఆడబిడ్డ అంతరంగం
ఎన్నడూ లేని ధైర్యం, ఎప్పుడూ చూడని ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి నాలో! అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయనిపిస్తున్నది.ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని గతంలో ఎన్నోసార్లు బాధపడిన నేనే..ఇప్పుడు ప్రతిక్షణాన్నీ సంతోషంగా ఆస్వాదిస్తున్నా! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా ఆనందానికి కారణాలను సాటి ఆడపడుచులతో పంచుకోవాలనే ఈ లేఖ రాస్తున్నా..

ప్రియమైన అక్కాచెల్లెళ్లకు..
తెలంగాణ ఆడపడుచులుగా మనం గర్వపడాల్సిన సమయం ఇది. ఎందుకంటారా? ప్రపంచంలో ఏ స్త్రీకీ లేని అచ్చటాముచ్చటా మనకు మాత్రమే సొంతం. ఊరించక విషయం చెప్పు విమలాక్షీ అంటారా..! అమ్మోరును ఆరాధించే బోనాల వేడుక మన సంస్కృతి. తీరొక్క పూలతో బతుకమ్మను కొలిచే సంప్రదాయం మనది. ఈ రెండు వేడుకలూ ఆడవారి ప్రాధాన్యాన్ని తెలియజేసేవే. స్త్రీశక్తికి ప్రతీకగా భావించే అమ్మవారిని, అందరి అమ్మగా భావించే బతుకమ్మను ఆడపడుచులు ఆదరంగా ఆరాధించే పండుగలు సమాజంలో స్త్రీ స్థానాన్ని తెలియజేస్తాయి. అయితే, కాలక్రమంలో కొడిగట్టిన ఈ సంబురాలు మలిదశ ఉద్యమంతో మళ్లీ అస్తిత్వాన్ని సాధించాయి. తెలంగాణ కల సాకరమయ్యాక, పూర్వ వైభవాన్ని సంతరించుకొని ఆడబిడ్డల ఆనందోత్సాహాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగే ఇప్పుడు. ‘నేను ఆడపిల్లని. నేను ఆడపిల్ల తల్లిని..’ అని సగర్వంగా చెప్పుకొనే వాతావరణం తెలంగాణలో ఉంది. అమ్మ బొజ్జలో చేరిన నాటి నుంచీ పసిగుడ్డును కంటికిరెప్పలా కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటున్నది. అమ్మ ఆనందంగా ఉంటేనే కదా, బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య లక్ష్మి’తో గర్భిణుల ఆరోగ్యంపై, పుట్టింటివారికన్నా ఎక్కువ శ్రద్ధ చూపుతున్నది. ‘కేసీఆర్‌ కిట్‌’ చలువతో తల్లీబిడ్డల క్షేమం గురించి బెంగే లేకుండా పోయింది. పురిటి కోసం పుట్టింటికి పోయి, పండంటి బిడ్డను ఎత్తుకొని అత్తారింటికి వస్తున్న తల్లి కండ్లల్లో ఆనందం ఉప్పొంగుతున్నది.
ఆడకూతురు పుట్టిందని ఆగమాగమయ్యే రోజులు ఎప్పుడో పోయాయి. ‘మా ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింద’ని మిఠాయిలు పంచుకుంటున్నారు అమ్మానాన్నలూ తాతా అవ్వలూ. తన కూతురు భవిష్యత్తు గురించి తండ్రికి చింతే లేదు. యుక్త వయసుకు వచ్చిన ఆడబిడ్డ రక్షణ గురించి ఏమాత్రం భయమే లేదు. ఆకతాయిలు అల్లరి చేస్తే భరతం పట్టడానికి ‘షీ టీమ్స్‌’ సదా సిద్ధంగా ఉంటాయి. పెద్ద చదువులు చదవడానికి ఉపకార వేతనాలు అందుతున్నాయి. పట్టా చేతికి రాగానే.. కొలువులు ఇవ్వడానికి సర్కారుతో పాటు కార్పొరేట్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ‘నా కూతురు డాక్టర్‌, నా కూతురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, నా కూతురు టీచర్‌, నా కూతురు పోలీస్‌’ అని ప్రతి తండ్రీ కాలర్‌ ఎగరేస్తూ చెప్పవచ్చు, ప్రతి తల్లీ అమ్మలక్కల ముందు సగర్వంగా ప్రకటించవచ్చు. కాబట్టే, ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ఊరు ఊరంతా సంబురాలు చేసుకునే పల్లెలు.. ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. గవర్నర్‌గా మహిళ, ప్రధాన న్యాయమూర్తిగా మహిళ, మేయర్‌గా మహిళ.. ఇలా ఎంతోమంది విజేతలను చూస్తూ, వారి నుంచి స్ఫూర్తి పొందుతూ పెరిగి పెద్దవుతారు తెలంగాణ బాలికలు.
నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెండ్లంటే ఓ యుద్ధమే! ఇంటిల్లిపాదీ పోరాడాల్సిందే. కూతురును ఓ అయ్య చేతిలో పెట్టడానికి ఉన్న కొద్దిపాటి భూమినీ తనఖా పెట్టే రైతు.. భవిష్యత్తును పణంగా పెట్టి పీఎఫ్‌ ఖాతాను ఖాళీ చేసే చిరుద్యోగి.. అక్క పెండ్లి కోసం చదువు మానేసే చెల్లి.. పేపర్‌బాయ్‌ అవతారమెత్తే తమ్ముడు.. భర్తకు తోడుగా కూలికి వెళ్లడానికి సిద్ధపడే తల్లి.. ఇందరు త్యాగం చేస్తేనే ఆ చిట్టితల్లికి కల్యాణ యోగం. అందుకే ‘ఎదిగిన ఆడపిల్ల గుండెల మీద కుంపటి’ అన్నారు. కానీ, తరతరాలుగా వస్తున్న ఆ నానుడికి తెలంగాణలో నూకలు చెల్లాయి. కన్నవారు కొత్త పెండ్లికూతురును ఆనందబాష్పాలతో అత్తవారింటికి సాగనంపాలే కానీ, అష్టకష్టాలు పడుతూ కాదు. స్వరాష్ట్రంలో, స్వపరిపాలనలో ఏ ఆడపిల్ల తండ్రీ స్వాభిమానాన్ని చంపుకోవద్దనే ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది సర్కారు. నిఖా పక్కా చేసుకున్న ముస్లిం సోదరుల ఇంట ఖుషీ నిలుపడానికి ‘షాదీ ముబారక్‌’ పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్నది. లక్షణంగా లక్షానూట పదహార్లు చదివించి పెండ్లికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నది ప్రభుత్వం.
మహిళ జీవితంలో వైధవ్యం, వృద్ధాప్యం తీవ్ర సంక్షోభాలు. ఆ సమయంలోనూ ప్రభుత్వం ఆత్మ బంధువులా అండగా నిలుస్తున్నది. విధి వెక్కిరించి ఒంటరిగా మిగిలిపోయిన అతివలను ఆదుకుంటున్నది. వృద్ధాప్యంతో సతమతమవుతున్న అవ్వలకూ ‘ఆసరా’ అందిస్తున్నది. చెల్లెకి అన్నలా, అక్కకు తమ్ముడిలా, తల్లికి బిడ్డలా.. సాయం చేసే ప్రభుత్వం ఉండటం మహిళలకు వరమే!
‘నేను ఆడపిల్లని. నేను ఆడపిల్ల తల్లిని..’ అని సగర్వంగా చెప్పుకునే వాతావరణం తెలంగాణలో ఉంది. అమ్మ బొజ్జలో చేరిన నాటి నుంచీ పసిగుడ్డును కంటికిరెప్పలా కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటున్నది.
ఇట్లు… పి.మానస

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement