ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే. అత్యంత థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను యువపేసర్ అర్షదీప్ సింగ్ జారవిడిచాడు. దీంతో చాలా మంది అతన్ని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ లెజెండ్ వసీం జాఫర్ ఈ యువపేసర్‌కు మద్దతుగా నిలిచాడు.
అర్షదీప్ జారవిడిచిన క్యాచ్ చాలా విలువైందని, ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదని జాఫర్ స్పష్టం చేశాడు. అదే సమయంలో క్రికెట్లో కొన్నిసార్లు అలా జరుగుతుందని, ఇలా నేలజారిన క్యాచ్‌ను పట్టుకొని ఆటగాళ్లను విమర్శించకూడదని సూచించాడు. అర్షదీప్ క్యాచ్ జారవిడవడంతో సోషల్ మీడియాలో అతనిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
This catch costed us..#AsiaCup2022 #INDvPAK #arshdeepsingh pic.twitter.com/yQRxhQ5ONs
— RVCJ Media (@RVCJ_FB) September 4, 2022