e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News వర్గల్‌ గురుకుల్‌ @ జయకేతముల్‌

వర్గల్‌ గురుకుల్‌ @ జయకేతముల్‌

  • మోడల్‌గా రెసిడెన్షియల్‌ ఉమెన్స్‌ కళాశాల
  • విద్యార్థినులకు నాణ్యమైన విద్యాబోధన
  • విద్యతోపాటు పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ
  • కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ సంస్థలకు ఎంపిక
  • ఆటలు, పాటల కార్యక్రమాల్లోనూ భేష్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 30 (నమస్తే తెలంగాణ): అది విజయతీరాలకు దారిచూపే విద్యావేదిక. విద్యార్థినులను అన్ని రంగాల్లో మెరికల్లా తీర్చిదిద్దే భూమిక. వసతుల్లో కార్పొరేట్‌కు దీటుగా నిలబడ్డ విజయవీచిక. రాష్ట్రంలోని మహిళా గురుకుల కళాశాలలకే అదో మాతృక. అదే రాష్ట్రంలో మొట్టమొదటగా సిద్దిపేట జిల్లా వర్గల్‌లో ఏర్పాటైన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల. కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు రాష్ట్ర, జాతీయ పోటీ పరీక్షల్లోనూ రాణించేలా తర్ఫీదు ఇస్తున్నది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంజల్లో ఉండేలా తీర్చిదిద్దుతున్నది. 2015లో ఆరు గ్రూపులతో 140 మంది విద్యార్థినులతో ప్రారంభమైన కళాశాలలో ప్రస్తుతం 11 కోర్సుల్లో 1,008 మంది అభ్యసిస్తున్నారు. కళాశాలలో ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లు పూర్తయ్యాయి.

సకల వసతులు.. సొంత కిచెన్‌ గార్డెన్‌

కళాశాలలో ప్రభుత్వం సకల వసతులను కల్పించింది. విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్‌ ప్రయోగశాలలు, కంప్యూటర్‌ల్యాబ్స్‌, డార్మెటరీ, అధునాతన వ్యాయామశాల, ఎకరం
విస్తీర్ణంలో కిచెన్‌గార్డెన్‌ వంటి వసతులు ఉన్నాయి. అక్కడే ఆకుకూరలు, కాయగూరలను పండిస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇక్కడి విద్యార్థినులు జాతీయస్థాయి పోటీల్లోనూ సత్తా చాటుతున్నారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ జనరల్‌ కోర్సులే గాకుండా కంప్యూటర్‌ సైన్స్‌, ఇతర ప్రత్యేక కోర్సులను నిర్వహిస్తున్నారు. 2018లో కళాశాల నుంచి మొదటి బ్యాచ్‌ విద్యార్థినులు 99.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2019లో 98.80 శాతం, 2020లో 98 శాతం, 2021బ్యాచ్‌ 98.80 శాతం ఉత్తీర్ణత సాధించింది.

నైపుణ్యాల పెంపునకు ఉచిత శిక్షణ..

- Advertisement -

ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా విషయ నిపుణులను తీసుకొచ్చి గెస్ట్‌ లెక్చర్స్‌ ఇప్పిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ తదితర వాటిపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే పై చదువులకు అనుగుణంగా వివిధ పోటీపరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు డాటా సైన్స్‌, జావా తదితర అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. సాయంత్రంవేళ ప్రత్యేకంగా కరెంట్‌ అఫైర్స్‌, న్యూమరికల్‌, మెంటల్‌ ఎబిలిటి, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తదితర తరగతులను నిర్వహిస్తూ మాక్‌ ఇంటర్వ్యూలను, క్విజ్‌ పోటీలను పెడుతూ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినులకు వేసవి సెలవుల్లోనూ ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉన్నత భవితకు బాటలు పరుస్తున్నారు. కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌ వంటి ప్రముఖ సంస్థలు కళాశాలకు వచ్చి ప్రాంగణ నియామకాలు నిర్వహించడం విశేషం. 2019 నుంచి ఇప్పటి వరకు 50 మందికిపైగా విద్యార్థినులు ఉద్యోగాలను సాధించారు. ప్రతిష్ఠాత్మక సంస్థలు, యూనివర్సిటీల్లో ర్యాంకులను పొంది ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు.

మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

తెలంగాణలో ఏర్పాటైన మొట్టమొదటి బీసీ బాలికల డిగ్రీ గురుకుల కళాశాల. మిగతా వాటికి దీనిని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. విద్యార్థినులకు విద్యతోపాటు ఇతర పోటీపరీక్షలకు సైతం శిక్షణ ఇస్తున్నాం. సెమినార్లు, విషయ నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వేసవిలోనూ ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. – వెంకటేశ్వర్‌రావు, ప్రిన్సిపాల్‌

ప్లేస్‌మెంట్స్‌ కోసం ప్రత్యేక శిక్షణ

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్హతలే కాదు ఇతర నైపుణ్యాల ప్రాముఖ్యత కూడా ఎంతో పెరిగిం ది. నైపుణ్యాలున్నవారికే ఉద్యోగావకాశాలు ఎక్కువ. రోజువారీగా వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నాం. మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ లోపాలను సరిదిద్దుతున్నాం. ఫలితంగానే ప్లేస్‌మెంట్లలో చక్కని అవకాశాలను దక్కించుకొంటున్నారు. – సుచిత్ర, వైస్‌ ప్రిన్సిపాల్‌

అధ్యాపకుల ప్రోత్సహం వల్లే

మాది కామారెడ్డి జిల్లా. కంజారా సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌లో ఇంటర్‌ వరకు చదివా. ఇక్కడ డిగ్రీ బీఎస్సీ (ఎమ్మెస్‌ సీఎస్‌) 2020లో పూర్తిచేశా. ప్రస్తుతం అజీమ్‌ ప్రేమ్‌జీ వర్సిటీలో ఎంఏ ఎడ్యుకేషన్‌లో ఫ్రీ సీటు సాధించా. రాష్ట్రస్థాయి చెస్‌ పోటీ ల్లో బహుమతులు గెలుచుకున్నా. ఇదంతా గురుకుల అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది. – మాలోత్‌ శిరీష, పూర్వ విద్యార్థి, (ఎంఏ ఎడ్యుకేషన్‌, అజీమ్‌ప్రేమ్‌జీ యూనివర్సిటీ)

ఆటల్లోనూ ప్రత్యేక శిక్షణ

మెరుగైన విద్యతోపాటు క్రీడల్లోనూ మంచి శిక్షణ ఇస్తున్నారు. ఏడుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సా ధించాను. పదికిపైగా బంగారు పతకాలు అందుకునేలా నన్ను గురుకుల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌కు ఎంపికయ్యాను. – సమ్మక్క, బీఎస్సీ సెకండియర్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement