e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home News ఉద్యోగుల సంబురం

ఉద్యోగుల సంబురం

ఉద్యోగుల  సంబురం

పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగుల హర్షాతిరేకాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు

మహబూబ్‌నగర్‌, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాసనసభలో సీఎం కేసీఆర్‌ పీఆర్సీపై ప్రకటన చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు వరాల జల్లు కురిపించారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. కాగా, ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. టీజీవోలు, టీఎన్జీవోలు, పీఆర్టీయూ (టీఎస్‌) తదితర ప్రధాన సంఘాలన్నీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సంబురాల్లో మునిగితేలారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైందని కేసీఆర్‌ పేర్కొనడాన్ని అన్ని సంఘాలూ స్వాగతించాయి. మరింత ఉత్సాహంతో తమ విధులు నిర్వర్తిస్తామని ఉద్యోగులు తెలిపారు. సీఎం ప్రకటనతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 24 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు లబ్ధి పొందనున్నారు.
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్‌సీ ప్రకటించడంతోపాటు పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు 180 రోజులూ ప్రసూతీ సెలవులు ఇవ్వడం హర్షణీయం. ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ కు ఉన్న అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ పరిష్కారమైంది.

  • తిమ్మారెడ్డి, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట
    సీపీఎస్‌ ఉద్యోగులకు వరం..
    సీపీఎస్‌ ఉద్యోగులకు కుటుంబ పింఛన్‌ ఇవ్వడం హర్షణీయం, అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం పింఛన్‌ సదుపాయం తొలగించినా.. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులను కడుపులో పెట్టుకొని కుటుంబ పింఛన్‌ ప్రకటించడం దార్శనికతకు నిదర్శనం. ప్రతి ఉద్యోగికి దీంతో భరోసా ఏర్పడింది. సీఎం ఉపాధ్యాయుల పక్షపాతి అని మరోసారి నిరూపితమైంది.
  • మద్దిలేటి, సీపీఎస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
    ఇది మంచి పీఆర్సీ..
    రైతులు, వివిధ వర్గాలకు అనేక పథకాలు కల్పించిన సీఎం కేసీఆర్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మంచి పీఆర్సీ ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. ఆలస్యమైనప్పటికీ మంచి ఫిట్‌మెంట్‌ వచ్చింది. పదవీ విరమణ వయస్సు పెంచడంపై ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు.
  • ఎం.జనార్దన్‌, హిందీ పండిట్‌, తిర్మలాపూర్‌
    సీఎం నిర్ణయం హర్షణీయం..
    ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ 30 శాతం పీఆర్సీ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఇంత కాలం పీఆర్సీ ప్రకటన కోసం ఎదురుచూసిన ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ఈ నిర్ణయం హర్షణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
  • డి.రాజేశ్వరి, టీజీటీ, గురుకుల పాఠశాల, నారాయణపేట
    పోరాటాన్ని గుర్తించారు..
    తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చేసిన పోరాటాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, 4వ తరగతి ఉద్యోగులకు అందరికీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ ప్రకటించడం హర్షణీయం. టీఎన్జీవో సంఘాన్ని గుర్తిస్తూ కేసీఆర్‌ చేసిన ప్రసంగం మరిచిపోలేనిది. ఇకముందు కూడా మా సంఘం ఉద్యోగుల హక్కులపై పోరాడుతూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంది.
  • భావండ్ల వెంకటేశ్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌
    చాలా సంతోషంగా ఉంది..
    పీఆర్సీ, ఫిట్‌మెంట్‌ ప్రకటించడం సంతోషించదగ్గ విషయం. రిటైర్మెంట్‌ వయస్సు పెంచడం, భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పనిచేసుకునే అవకాశం ఇవ్వడం గతంలో ఎవరూ చేయలేదు. కేజీబీవీ మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతీ సెలవులు ప్రకటించడం హర్షణీయం. సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛన్‌ ప్రకటించడం, ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న వారికి 10 వేల పోస్టులకు పదోన్నతులు ఇస్తానని చెప్పడం సంతోషకరం.
  • ఏ అమరేంద్రసాగర్‌, టీపీటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
Advertisement
ఉద్యోగుల  సంబురం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement