e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News నిప్పుముప్పు

నిప్పుముప్పు

నిప్పుముప్పు

నల్లమలలో వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలకు ఆస్కారం
మానవ తప్పిదం వల్లే సింహ భాగం ప్రమాదాలు
అటవీ జంతువులకు పొంచి ఉన్న ప్రాణహాని
రక్షణ చర్యలకు అటవీ శాఖ కృషి
మెస్సేజ్‌ అలర్ట్‌తో అప్రమత్తంగా క్యూఆర్టీ బృందాలు

మహబూబ్‌నగర్‌, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘పంచభూతాలతో నిండిన ప్రకృ తి దేవుడిచ్చిన వరం.. ప్రాణవాయువును అందిం చే చెట్లు మనిషి మనుగడకు ఆధారం.. మనిషి లే కున్నా ప్రకృతి ఉంటుంది.. ప్రకృతే లేకపోతే మానవాళికి మనుగడే ఉండదు.. భౌగోళిక సమతుల్య త, పర్యావరణ పరిరక్షణలో అడవులది ప్రధాన పాత్ర..’ అలాంటి అడవులంటే మన ప్రాంతంలో గుర్తొచ్చేది నల్లమల అటవీ ప్రాంతమే. సుమారు 1600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి.. అ మ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)గా పెద్ద పులులకు సంరక్షణనిస్తున్నది. అనేక వన్యప్రాణులకు న ల్లమల ఆవాసం. ఇలాంటి ప్రకృతి సంపదకు కొం దరు స్వార్థంతో నిప్పు పెడుతున్నారు. వేసవి వ చ్చిందంటే అడవిలో కార్చిచ్చు రగులుతున్నది. అ గ్నికీలలు జంతు జాలంతోపాటు మానవాళి మనుగడకు ముప్పు తెచ్చి పెడుతున్నాయి. ఒక మొక్క వృక్షంగా మారేందుకు కొన్నేండ్ల సమయం పడుతుంది. కార్చిచ్చు రగిలితే నిమిషాల్లో వందల వృ క్షాలు భస్మీపటలమవుతాయి. ప్రమాదాల వల్ల జ రుగుతున్న ఘటనల కంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న అగ్నిప్రమాదాలే అధికమని అధికారులు చెబుతున్నా రు. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించే క్యూఆర్టీ బృందాలతో అడవిని కాపాడేందుకు అటవీ శాఖ ప్రయత్నిస్తున్నది.
తరచూ అగ్ని ప్రమాదాలు..
నల్లమలలోని అన్ని రేంజర్లలోనూ వేసవిలో త రచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దట్టమైన అడవిలో నన్నారి గడ్డ, ఇప్ప పువ్వు సేకరణ కోసం కొందరు.., గొర్రెలను మేపేందుకు మరి

అడవంతా విస్తరించిన కాశగడ్డి..
కొల్లాపూర్‌ రూరల్‌, మార్చి 22 : నల్లమల అడవిలో కాశగడ్డి విస్తరించి ఉన్నది. దీంతో కొద్దిపాటి నిప్పు మిరుగులకే ఎండుగడ్డి అంటుకొని క్షణాల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఎ ర్రపెంట, అంకిల్‌పెంట, పెద్దూటి, కర్తిబోడు వంటి లోతట్టు ప్రాంతాల్లో నిప్పంటుకున్న సంఘటనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎత్తయిన ప్రదేశాల్లో మంటలు చెలరేగితే చెట్లకొమ్మలు, గోనెసంచులు, కొబ్బరి మట్టలు, మోదుగ ఆకులున్న కొమ్మలతో ఆర్పేందుకు అటవీ శాఖ సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. తమ వద్ద ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ బాంబులు, రబ్బర్‌ మట్టలు కలి గి ఉన్న స్టీల్‌రాడ్లు (ప్లేట్లు)తో గాలిలేని ప్రదేశాల్లో మాత్రమే మంటలను అదుపులోకి తీసుకురావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఎత్తయిన ప్రదేశాల్లో బాంబులు, ప్లేట్లు ఎందుకూ పనికిరావంటున్నారు. అయితే, నిప్పంటుకుని పొగలు వస్తున్నప్పుడే ముందు జాగ్రత్తగా సమాచారం ఇస్తే ఎ క్కువ నష్టం జరగకుండా కాపాడొచ్చటున్నారు. మంటలు విస్తరించకముందే అదుపులోకి తీసుకొ స్తే వన్యప్రాణులకు మనుగడ సాధ్యమవుతుంది.

చింతపల్లి ఈస్టుసెక్షన్‌, బొల్లారం, ఎర్రపెంట, చు క్కలగుండం, ఎద్దుల గుండం, జాలుపెంట, అంకిల్‌పెంటలలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనే వన్యప్రాణుల సంచారం అ ధికంగా ఉంటుంది. ఇక్కడి ప్రాంతాల్లో మంటలు విస్తరించి వన్యప్రాణులకు ఆహారం అందకుండా పోతున్నది. ఫలితంగా వాటి సంతతి ఘననీయం గా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. చెట్లకొమ్మలు ఒకదానికొకటి రాసుకుని నిప్పు రాజుకుని మంట లు వ్యాప్తిచెందే అవకాశాలు చాలా తక్కువ. పశువుల కాపర్లు, చెంచుకుటుంబాలతోనే అడవులకు నిప్పంటుకుంటున్నదని అధికారులు చెబుతున్నా రు. వంట చేసుకున్న తర్వాత నిప్పును ఆర్పకుం డా ఉండడం, పశువుల కాపర్లు బీడీలు తాగి అలా గే పడేయడంతో గాలులకు నిప్పులు రేగి మంట లు వ్యాప్తి చెందుతున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా, లోతట్టు ప్రాంతాల్లో నిప్పంటుకుంటే వెళ్లేందుకు దారులు లేకపోవడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. అడవుల్లోకి వెళ్లేందు కు రహదారులు నిర్మిస్తే సమాచారం తెలిసిన వెం టనే అక్కడికి వెళ్లి మంటలు అదుపులోకి తీసుకొ చ్చే అవకాశం ఉన్నది. కొల్లాపూర్‌ రేంజ్‌ పరిధిలో 36 వేల హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించుకొ ని ఉన్నాయి. అందులో 20 వేల హెక్టార్లకుపైగా దట్టమైన అడవులున్నాయి. అందులో నిప్పంటుకుంటే అక్కడికి వెళ్లేందుకు దారులు లేకపోవడం తో ఇబ్బందిగా ఉందని అధికారులు, సిబ్బంది అంటున్నారు. దట్టమైన అడవుల్లో దాదాపు 35 కిలోమీటర్ల మేర దారులు నిర్మించాలని కోరుతున్నారు. కానీ అడవుల్లో దారులకు టెండర్లు పిలిచేందుకు అటవీశాఖ మీన మేషాలు లెక్కబెడుతుందని కిందిస్థాయి అధికారులు అంటున్నారు.


కొందరు కా వాలనే అటవికి నిప్పు పె డతారని అధికారులు చెబుతున్నారు. మన్ననూరు-శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనదారులు, పాదచారులు వాడి పడేసే బీడీ, సిగరెట్‌, అగ్గి పుల్లలు కొన్నిసార్లు నిప్పు రాజేయడానికి కారణమవుతున్నాయంటున్నారు. వేసవిలో ఎండుటాకులు, ఎండుగడ్డి ఉండటంతో ని ప్పు త్వరగా వ్యాపించే అవకాశం ఉంది. చిన్నపాటి నిప్పురవ్వ కూడా దావాలంగా వ్యాపిస్తుంది. నన్నారి గడ్డలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. కేజీ సుమారు రూ.600కు పైగా అమ్ముడవుతున్నది. దీంతో దట్టంగా ఉన్న గడ్డిని తొలగించేందుకు స్థానికులే నిప్పు పెడతారని అధికారులు చెబుతున్నారు. నాటుసారా కోసం ఇప్ప పువ్వు సే కరణకు సైతం నిప్పు పెట్టడం సాధారణంగా మా రిందని వాపోతున్నారు. అడవికి నిప్పు పెట్టకుం డా అటవీ ఉత్పత్తులను సేకరించుకోవాలని అధి కారులు కోరుతున్నారు.
సంరక్షణకు చర్యలు..
ఏటీఆర్‌ పరిధిలో 139 బేస్‌ క్యాంపుల్లో 94 మంది బీట్‌ ఆఫీసర్లు, సెక్షన్‌ ఆఫీసర్లు విధులు ని ర్వర్తిస్తున్నారు. 70 మంది వాచర్లు సైతం అటవీ సంరక్షణలో ఉన్నారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉన్నారు. అడవికి నిప్పు రాజుకోకుండా ఉండేందుకు ఏటా సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గడ్డి, చెట్ల ఆకులు రాలిన ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు నిప్పంటుకున్నా మంటలు వ్యాపించకుండా ఫైైర్లెన్‌, వ్యూ లైన్స్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రచార రథం ద్వారా అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతలపై అవగాహన కల్పిస్తున్నారు. అడవిలో ఏ మూల నిప్పు అంటుకున్నా ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెంటనే అప్రమత్తం చేస్తూ ఫైర్‌ అలర్ట్‌ సమాచారం వైర్‌లెస్‌లో అందుతున్నది. సిబ్బంది అక్కడకు వెళ్లి మంటల ను అదుపు చేయాల్సి ఉంటుంది. ఏ మూల ఏమి జరుగుతుందనే సమాచారం క్షణాల్లో అందుతుం ది. ఫోన్లకు, మెయిల్‌కు సమాచారం వస్తుంది. మంటలను త్వరగా అదుపులోకి తీసుకొచ్చేందు కు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్లోయర్లను వి నియోగిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగితే అ చ్చంపేట నుంచి ఫైర్‌ ఇంజన్‌ను రప్పిస్తున్నారు.
నన్నారి గడ్డల కోసం వెళ్లి..
ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం దేవరపెంట అటవీ ప్రాంతం సమీపంలోని చెంచుపెంటలకు చెందిన 11 మంది నన్నారి గడ్డల కోసం వెళ్లారు. వాళ్లు వెళ్లిన ప్రాంతం ‘వి’ ఆకారంలో ఉన్న దట్టమైన లోయ. నన్నారి గడ్డలు సేకరిస్తున్న సమయంలో చెలరేగిన మంటలకు చెంచులు అక్కడి నుంచి తప్పించుకోవడమే కష్టంగా మారింది. ఎ టువెళ్లినా దట్టంగా మంటలు. లోయలో ఇరువైపుల నుంచి గాలి బాగా వీయడంతో మంటలు పెరిగిపోయాయి. ఎలాగోలా నలుగురు తప్పించుకుని ఎగువ ప్రాంతానికి వచ్చి సెల్‌ఫోన్‌ ద్వా రా తమ బంధువులకు సమాచారం అందించా రు. అటవీ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను అచ్చంపేటకు.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగ ర్‌, హైదరాబాద్‌ తరలించారు. చికిత్స పొందు తూ ఈర్లపెంటకు చెందిన లింగమయ్య (32), మామిళ్ల లింగయ్య (30), అప్పాపూర్‌కు చెంది న కె.ఎల్లయ్య (29) మృత్యువాత పడ్డారు. మ రో ఇద్దరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నా రు. ఆరుగురు కోలుకుని చెంచు పెంటలకు చేరుకున్నారు. అడవికి నిప్పు.. మానవాళి మనుగడ కు ముప్పు అని స్థానికులు గుర్తించలేకపోతున్నారని అటవీ శాఖ అధికారులు వాపోతున్నారు. అ డవులు అంతరించిపోకుండా అటవీ శాఖ సి బ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొంద రి తీరుతో కార్చిచ్చు తప్పడం లేదని చెబుతున్నారు. వేసవికాలం పూర్తి కాకముందే ఇప్పటికే సుమారు 50 వరకు అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని ఉంటాయని అధికారులు అంటున్నారు.

Advertisement
నిప్పుముప్పు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement