హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని వైద్య కళాశాల, టీచింగ్ హాస్పిటల్స్, వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో సేవలందిస్తున్న దవాఖానల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయడానికి అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 327పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హుత, ఆసక్తి కలిగినవారు www.hyderabad.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవాలని, ఈనెల 20, 23, 24వ తేదీల్లో సికింద్రాబాద్లోని వైద్య, ఆరోగ్యశాఖ, కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి కోరారు.