e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ఆర‌బోత‌లో పోటీ ప‌డుతున్న హాట్ యాంక‌ర్స్‌

ఆర‌బోత‌లో పోటీ ప‌డుతున్న హాట్ యాంక‌ర్స్‌

ఆర‌బోత‌లో పోటీ ప‌డుతున్న హాట్ యాంక‌ర్స్‌

ఒక‌ప్పుడు గ్లామ‌ర్ షో కేవ‌లం హీరోయిన్స్ మాత్ర‌మే చేసేవారు. ఇప్పుడ‌లా కాదు క‌థానాయిక‌ల‌తో పోటీ ప‌డుతూ రెచ్చిపోయి అందాల ఆర‌బోస్తున్నారు కొంద‌రు సెక్సీ యాంక‌ర్స్. అందాల ఆర‌బోత విష‌యానికి వ‌స్తే ముందు అన‌సూయ పేరే చెప్పాలి. బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్దిన ఈ ముద్దుగుమ్మ అడ‌పాద‌డ‌పా హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ యూత్‌ను క‌వ్విస్తుంటుంది. ఇక ఈ మ‌ధ్య శ్రీముఖి త‌న‌ పంథా మార్చి అందాల ఆరబోత‌కు దిగింది. ఈ మ‌ధ్య గోవా వెళ్ళిన శ్రీ బీచ్‌లో పొట్టి బ‌ట్ట‌ల‌లో ఫొటో షూట్స్ చేసి వాటిని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి ఫుల్ వైర‌ల్ అయ్యాయి.

ఇక రీసెంట్‌గా పేప‌ర్ లాంటి పొట్టి దుస్తులు ధ‌రించి ఎద అందాల‌ను ఆర‌బోసి అగ్గిరేజేసింది. ఈ పిక్స్ చూసి నెటిజ‌న్స్ షాక్ అయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే ఫేమ్ తెచ్చుకుంటున్న  విష్ణు ప్రియ తాజాగా రెచ్చి పోయి మ‌రీ అందాలు ఆర‌బోసింది. త‌న హాట్ ఫిగ‌ర్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పోరా పోవే ప్రోగ్రాంతో ఫేమ‌స్ అయిన విష్ణు ప్రియ ఈ మ‌ధ్య గ్లామ‌ర్ షోతో హాట్ టాపిక్‌గా మారుతుంది. ప్ర‌స్తుతం విష్ణు ప్రియ ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర‌బోత‌లో పోటీ ప‌డుతున్న హాట్ యాంక‌ర్స్‌

ట్రెండింగ్‌

Advertisement