ఫాంటసీ సినిమాల్లో దేవకన్యలు జలకాలాడే నీటి కొలనులు ఎక్కడ ఉంటాయో మనకు తెలీదు. కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. ఆ కొలనులోనే దేవతలు దిగుతారేమో అనిపిస్తుంది. అది నిజమైన కొలనేనా? లేక ఎవరైనా గ్రాఫిక్స్ చేశారా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. కానీ ఇది నిజమేనట. ప్రపంచంలో చాలా మందికి టూరిస్ట్ డెస్టినేషన్ అయిన స్విట్జర్లాండ్లోని బ్రీంజ్ సరస్సుకు చెందిన వీడియో ఇది.
ఒక జింకల గుంపు ఈ సరస్సు దగ్గరకు వచ్చి, అక్కడ చాలా శుభ్రంగా ఉన్న నీళ్లు తాగుతూ.. ఆ నీళ్లలో అటూ ఇటూ తిరుగుతూ ఈ వీడియోలో కనిపిస్తాయి. చుట్టూ పచ్చదనం, వాటి మధ్యలో శుభ్రమైన నీళ్లు, ఆ నీళ్లలో జింకలు చూడగానే.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి ఇక్కడే దిగిందేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉందీ వీడియో. అందుకే నెటిజన్లు కూడా నోరెళ్లబెట్టేస్తున్నారు. ‘ఇదేదో డిస్నీ ఫాంటసీ సినిమాలో సీన్లా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Deer enjoying the clear water of Lake Brienz, Switzerland.. 😊 pic.twitter.com/YkFVvcmAWb
— Buitengebieden (@buitengebieden) October 1, 2022