ఒక పసిపాప తనకంటే మూడు రెట్లు పెద్దగా ఉన్న వ్యక్తిని ఎడాపెడా కొట్టేసింది. ఎత్తి కింద పడేసింది. కరాటే చేస్తూ చెయ్యి విరిచేసింది. ఆ నొప్పి తట్టుకోలేని సదరు వ్యక్తి తన ఓటమిని ఒప్పేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ పసిపాపకు ఒక వ్యక్తి కరాటే నేర్పిస్తున్నాడు. దీనిలో భాగంగానే పాపతో కరాటే చేస్తూ ఆ టీచర్ ఓడిపోయాడు.
పాప అతని చెయ్యి పట్టుకొని లాగగానే.. ఆ టీచర్ కింద పడిపోయాడు. ఇలా రెండు మూడుసార్లు కింద పడిన తర్వాత.. అతన్ని కుడి చెయ్యి పట్టుకొని వెనక్కు విరిచిందా పాప. దాంతో తను ఓడిపోయినట్లు ఆ టీచర్ అంగీకరించాడు. పాప కోసం ఆ టీచర్ అలా చేయడాన్ని చూసిన నెటిజన్లు.. అతన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో ‘కరాటే కిడ్’ చాలా ముద్దొచ్చేస్తోందని మరికొందరు అంటున్నారు.
aww so cute!! pic.twitter.com/m4XDUthafF
— Funnyman (@fun4laugh) August 9, 2022