‘ఎవరు చేసిన కర్మ వారనుభవించు’ అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తమ బండి ఫాస్ట్‌గా వెళ్లాలని బర్రెను గట్టిగాబాదారు. అది ఫాస్ట్‌గా పరుగెత్తి బండిలో ఉన్న వాళ్లందరినీ రోడ్డుపైన పడేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ట్విటర్లో షేర్చేశారు. ఈ వీడియోలో కొంతమంది రెండు జట్లుగా విడిపోయి రేసింగ్ పెట్టుకున్నారు. ఐదురుగురు కలిసి ఎడ్లబండికి బర్రెను కట్టి దానిపై ప్రయాణించగా, మరో ఇద్దరు గుర్రపుబండిపై రేసింగ్‌లో పాల్గొన్నారు. గుర్రపుబండి ఫాస్ట్‌గా వెళ్తుండగా, బర్రె లాగే బండి వెనకబడిపోయింది. దీంతో ఆ బండిలోని యువకులు బర్రెను గట్టిగా బాదారు. అది వేగంగా పరుగెత్తి ఓ డివైడర్‌ను ఢీకొట్టింది. బండి ఫల్టీకొట్టి అందులోని ఐదుగురు గాల్లోకి లేచి, రోడ్డుపై పడిపోయారు. దీనికి కాస్వాన్ ‘కర్మ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసినవాళ్లంతా కర్మఫలం అనుభవించక తప్పదంటూ కామెంట్ చేశారు.
Karma 🙏
(Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO— Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022