ఆకాశంలో మేఘాలు ఎలా ఉంటాయి? మామూలుగా అయితే తెల్లగా ఉంటాయి. భారీ వర్షం పడేలా ఉంటే నల్లగా ఉంటాయి. కానీ పర్పుల్ రంగులో ఉన్న మేఘాన్ని ఎప్పుడైనా చూశారా? సరిగ్గా ఇలాంటి మేఘమే అమెరికాలోని చిలీ ఆకాశంలో కనిపించింది. ఆదివారం నాడు దీన్ని చూసిన ప్రజలు షాకైపోయారు. ఇలా ఎందుకు జరిగిందా? అని రకరకాల కారణాలు చెప్తున్నారు.
ఇక్కడకు కొంత దూరంలో ఉన్న కాలా కాలా మైన్స్ నుంచి అయోడిన్ ఆవిరి గాల్లో కలవడం వల్లనే ఇలా జరిగిందని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఇక్కడి మోటార్ ఇంపెల్లర్ పంప్ ఫెయిలవడంతో ఘన స్థితిలో ఉండే అయోడిన్ ఆవిరిగా మారిందని, దీని వల్లే ఇలా ఆకాశంలో పర్పుల్ మేఘం ఏర్పడిందని స్థానిక వాతావరణవేత్తలు అంచనా వేశారు.