యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో వచ్చిన చిత్రం విక్రమ్ (Vikram). జూన్ 3న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదలైన విక్రమ్ బాక్సాపీస్ వద్ద తన స్టామినా చూపిస్తోంది. ఇప్పటికే 2 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది విక్రమ్. తాజా కలెక్షన్లపై ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.
ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ రూ.2 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఓ తమిళ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు శుభపరిణామనే చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఈ చిత్రం కేవలం 3 రోజుల్లో రూ.50 కోట్ల మార్కు దాటి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరి వీక్ డేస్‌లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందనేది చూడాలంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీలో స్టార్ యాక్టర్లు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ , సూర్య కీ రోల్స్ పోషించారు. కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ ఈ సారి కొత్త ప్లాన్‌తో వస్తున్నాడా..?
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!