అర్జున్ రెడ్డితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). పూరీ జగన్నాథ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ (Liger)తో త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు లైగర్ విడుదల కాకముందే పూరీతో మరో ప్రాజెక్టు జనగణమన కూడా చేస్తున్నాడు. దీంతోపాటు శివనిర్వాణ డైరెక్షన్లో సమంతతో కలిసి ఖుషి (Kushi)సినిమాలో నటిస్తున్నాడు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉండే విజయ్ దేవరకొండకు బ్రేక్ దొరికినట్టుంది.
ఇంకేముంది ఈ సమయాన్ని తనకిష్టమైన సినిమా చూసేందుకు కేటాయించాడు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas)లో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన Top Gun: Maverick సినిమాలో నిన్న రాత్రి వీక్షించాడు. ఆ టైంలో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సింపుల్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్నాడు విజయ్.