e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News 'ఎఫ్‌3'లో వెంక‌టేశ్‌కు రేచీక‌టి ఉంటుందా..?

‘ఎఫ్‌3’లో వెంక‌టేశ్‌కు రేచీక‌టి ఉంటుందా..?

'ఎఫ్‌3'లో వెంక‌టేశ్‌కు రేచీక‌టి ఉంటుందా..?

టాలీవుడ్ యాక్ట‌ర్ వెంక‌టేశ్ సినిమా అంటే ఫ‌న్‌కు కొద‌వే ఉండ‌దు. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో చేస్తున్న ఎఫ్ 3 సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతున్నాడు వెంకీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్ డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ సర్కిల్‌ ను  రౌండ‌ప్ చేస్తోంది. ఎఫ్‌3 లో వెంకీ రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఫ‌న్‌..ఫ్ర‌స్టేష‌న్‌..ఫార్చూన్ ట్యాగ్‌లైన్‌తో డ‌బ్బు చుట్టూ తిరిగే కథాంశంతో స్టోరీ ఉండ‌నుండ‌గా..రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా వెంకీ పాత్రను అనిల్ రావిపూడి చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా డిజైన్ చేశాడ‌ట‌.

అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్‌లో ర‌వితేజ‌ను ఇప్ప‌టికే అంధత్వం గ‌ల వ్య‌క్తిగా చూపించిన తీరుకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మ‌రి ఈ సారి వెంకీని రేచీక‌టి ఉన్న రోల్‌లో ఎలా చూపిస్తాడో చూడాలి. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్‌2 సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
'ఎఫ్‌3'లో వెంక‌టేశ్‌కు రేచీక‌టి ఉంటుందా..?

ట్రెండింగ్‌

Advertisement