స్థలం చిన్నదా, పెద్దదా అనేది శాస్ర్తానికి అవసరం లేదు. పేదవాళ్లా, ధనికులా… అధికారులా అని ఆలోచించకుండా నేచర్ ఎలాగైతే అందరి సంతానానికి కాళ్లు, చేతులు, తదితర అంగాలను ఏర్పాటు చేస్తుందో.. అలాగే ఇండ్లు చిన్నవైనా, పెద్దవైనా.. శాస్త్ర అంశాలు వర్తిస్తాయి. ఒక తల వాకిలి వంటగది, మరుగు దొడ్డి నిద్రించే స్థలం లేదా గది.. ప్రతి ఇంటికీ వస్తాయి. అవి ఆయా గృహాల వైశాల్యాన్ని బట్టి ఉంటాయి. అంతేకానీ చిన్న ఇండ్లకు వాస్తు అవసరం లేదనే వాదన తప్పు.
శాస్త్రం ముందు ‘రాజు-బంటు’ తేడాలు ఉండవు.
‘దిశ’ కలిగిన వైభవ గృహం ’పెంకుటిల్లు’ కావచ్చు. అన్నీ హంగులు అర్భాటాలు ఉండే శాస్త్రం లేని ‘రాతి కోట’ పడావు పడి ఉండవచ్చు. కోటలెన్నో కొట్లాటలకే పనికి వచ్చిన చరిత్ర మనకు తెలియనిది కాదు. వాస్తు అన్ని ఇండ్లకూ వర్తిస్తుంది.
-పానుగంటి లక్ష్మి
అన్ని బాల్కనీలూ లోపలికి కలుపుకొని ఫ్లాట్‌ను
-ఆర్.వీ నిత్యా మీనా, సంగారెడ్డి
‘కోల్డు’ స్టోరేజీలో మాత్రమే వాటిని ఒక ‘బాక్స్’ లాగా చేసి వాడుకోవచ్చు. అంతేకానీ స్థలం (ఎస్ఎఫ్టి) పెరగాలనీ ఫ్లాట్‌ను అన్ని బాల్కనీలు లోనికి తీసుకోవద్దు. ‘ముఖ్యంగాబ్రీతింగ్ ప్లేస్’గా తూర్పు బాల్కనీ, ఉత్తరం బాల్కనీని ఓపెన్‌గానే పెట్టి, మిగతా భాగాలు ఉంటే దక్షిణ, పడమర బాల్కనీలు కలుపుకొని మీరు గోడౌనుగా వాడుకోండి. వెంటిలేషన్ తప్పక ఉండేలా ప్లాన్ చేసుకోండి. సరుకులు నిలువ పెట్టుకొనే స్థలానికైనా గాలి వెలుతురు అవసరమే కదా. పైగా మీ స్టోర్లోఎవరో కొందరు వ్యక్తులు ఉండి పని చేయాల్సి వస్తుంది. మొత్తం ప్యాక్ చేస్తే అక్కడ పని చేసే వ్యక్తులు అవస్థలు పడాల్సి వస్తుంది.
-ఎం. రవికాంత్, కాటేదాన్
సమతుల్యత అనేది ప్రతి నిర్మాణానికి అవసరం. మనం ఉన్న భూమి ఒకచోట స్థిరంగా ఉండేది కాదు. ప్రతి క్షణం చలనంతో కోట్ల సంవత్సరాలుగా పరుగులు తీస్తున్నది. తద్వారా కలిగే ప్రకంపనలు, పరిణామాలు కొన్ని యంత్రాలకు అందుతాయి. కొన్ని ఊహలకు కూడా అందవు.
శాస్త్రం చెప్పేవి చాలా లోతుగా ఉంటాయి. తప్పక మీ భవనానికి కాంపౌండు అవసరం. ఎత్తుమీద కట్టుకున్నా భూమి ఆధారంగా, లేదా కొండ ఆధారంగా ఏ నిర్మాణమైతే నిలబడుతుందో దాని చుట్టూ ఒక రక్షణ వలయం అవసరం. తద్వారా ఆయా దిక్కులు, ఎత్తు పల్లాలు మనకు హాని చేయకుండా ఉంటాయి. పైగా ఎత్తు మీద కట్టే కాంపౌండ్ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటిగోడలనే హద్దులుగా చేసుకొని నివాస గృహం ఉండటం మంచిదికాదు. రెండో రక్షణ అవసరం.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678