కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)నటించిన చిత్రం వలిమై (). ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ గుమ్మకొండ (Kartikeya) ప్రతినాయకుడిగా నటించాడు. తొలిసారి తమిళ్లో చేస్తున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ బాక్సాపీస్‌ను షేక్ చేస్తుంది. వలిమై హిట్ టాక్తోదూసుకెళ్తున్న నేపథ్యంలో కార్తికేయ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వలిమై సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, అజిత్ నుంచి చాలా నేర్చుకున్నానన్నాడు. సినిమా సక్సెస్, పెళ్లి తర్వాత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకున్నాడు.
అజిత్‌తో కలిసి పనిచేయడంపై మాట్లాడుతూ..అవకాశాలు అనేవి తాత్కాలికం. కానీ అజిత్‌కుమార్ సార్‌తో పనిచేసే ఛాన్స్ రావడం జీవితంలో మర్చిపోలేనిది. ఎలాంటి ఒత్తిడిగా ఫీల్ కాకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తి ఆయన. విడుదలకు 2 రోజుల ముందు నేను చెన్నైలో ఉన్నా. నన్ను గుర్తించిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ రిలీజైన తర్వాత థియేటర్‌కి వెళ్లినప్పుడు..రియాక్షన్ చాలా కొత్తగా ఉంది. RX100తో నాకు దక్కిన అనుభవంలా..వలిమై నాకు చాలా మంచి అనుభూతి కలిగించిందని చెప్పాడు.
స్టంట్స్ చేయడం ఛాలెంజ్‌తో కూడుకున్నది. అజిత్ సార్‌తో బైక్ సీక్వెన్స్‌లు చిత్రీకరించడం ఓ క్రేజీ ఛాన్స్. బైక్‌లను ఇష్టపడే వ్యక్తితో బైక్ సీన్లు చిత్రీకరించడం, ఫైట్ మాస్టర్లు ఉండడం గొప్ప అనుభవం లాంటిదని చెప్పుకొచ్చాడు కార్తికేయ.