vajraparsvakonasana | ఈ ఆసనాన్ని సాధన చేస్తే గర్భిణుల నడుము ఎముకలు బలంగా తయారవుతాయి. వెన్నెముక సత్తువను సంతరించుకుంటుంది. మెడపై ఒత్తిడి తగ్గుతుంది. సుఖ ప్రసవం అవుతుంది. కాకపోతే, డాక్టరు సలహా తీసుకున్నాకే ప్రయత్నించాలి. ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించినావెంటనే ఆపేయాలి.
☞ ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. అంటే, రెండు కాళ్లనూ వెనక్కి ముడుచుకొని, పాదాలను పిరుదుల కిందికి తీసుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని కాస్త పైకెత్తాలి. దీంతో వెన్నెముక నిటారుగా అవుతుంది.
☛ తర్వాత నిదానంగా మోకాళ్లపై పైకి లేవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి.
☞ ఊపిరి వదులుతూ కుడికాలు పాదాన్ని నేలపై ఉంచి, ఎడమ కాలును వెనక్కి చాపాలి. కుడి పాదం కుడివైపునకు చూడాలి.
☛ శ్వాస తీసుకుంటూ, కుడిచేతిని కుడికాలు తొడపై ఉంచాలి. అరచేయిని మోకాలిపై పెట్టాలి. ఇప్పుడు ఎడమ చేతిని పైకెత్తాలి. మెడను ఎడమ పక్కగా పైకెత్తి ఎడమ అరచేతిపై దృష్టి సారించాలి.
☞ ఈ ఆసన స్థితిలో పది సెకండ్లపాటు ఉండాలి. శ్వాసక్రియ నిదానంగా కొనసాగించాలి.
☛ తర్వాత ఎడమ చేతిని కిందికి దించి, కుడికాలును దించి సమస్థితికి రావాలి. ఇప్పుడు ఎడమవైపు కూడా ఆసనం కొనసాగించాలి.
– అనితా అత్యాల, ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు, 6309800109
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సుప్త వజ్రాసనం | రక్తప్రసరణ పెరిగేందుకు ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది
ఊర్ధ వజ్రాసనం | గర్భిణులు ఇలా చేస్తే వెన్నునొప్పి తగ్గిపోతుంది
వీరాసనం | కాన్పు తర్వాత ఈ ఆసనాలు వేస్తే ఎన్నో లాభాలు
అమ్మో ! సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలున్నాయా?