న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త. పలు కేటగిరీల వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ లు లేకుండానే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వీసా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కాన్సులర్ అధికారులకు అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్, హెచ్-1, హెచ్-3, హెచ్4, నాన్ బ్లాంకెట్ ఎన్, ఎం, వో, పీ, క్యూ, అకడమిక్ జే వీసాలకు ఇన్పర్సన్ ఇంటర్వ్యూలు ఉం డవు. అయితే గతంలో దరఖాస్తు చేసుకుని రిజెక్ట్ అయిన వారికి మినహాయింపు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.