e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News మోటార్ వెహికల్స్ డీలర్‌కు భారీ జరిమానా,జైలు శిక్ష..

మోటార్ వెహికల్స్ డీలర్‌కు భారీ జరిమానా,జైలు శిక్ష..

వాషింగ్ టన్,జూలై:అమెరికా కోర్టు మోటార్ వెహికల్స్ డీలర్‌కు ఐదేండ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, ఏకంగా 4 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. ఇంతకీ అమెరికన్ కోర్ట్ ఎందుకు ఈ డీలర్ కు భారీ జరిమానా తోపాటు,జైలు శిక్ష విధించింది. ఇంతకీ న్యాయస్థానం ఈ శిక్ష ఎందుకు విధించిందంటే..?

మోటార్ వెహికల్స్ డీలర్ ఓడో మీటర్‌ను ట్యాంపరింగ్ చేసిన నేరానికిగాను అతనికి ఐదేండ్ల జైలుశిక్షతోపాటు 4మిలియన్ డాలర్ల జరిమానా విధించింది అమెరికా కోర్టు. ఈ సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి, ఆతను తక్కువ కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపించే ఓడోమీటర్ పాత కార్లకు అమర్చేవాడు. అంతే కాదు వీటికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మేవారు.

- Advertisement -

కష్టమర్లను మోసంచేసికార్లను అమ్మిన కారణంగా అమెరికా కోర్టు ఈ డీలర్‌కు శిక్ష విధించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు సోదరులు దాదాపు 690 వాహనాలను మోసం చేసి విక్రయించారు. వారు 2006 నుంచి 2011 వరకు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరూ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెకండ్ హ్యాండ్ అమ్మకందారులు ఇలాంటిమోసాలకుపాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన సంఘటనలు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana