e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి

14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి

14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి

వాషింగ్టన్‌: ఒక మహిళ 14 ఏండ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. కొంత కాలంగా అతడితో శృంగారంలో పాల్గొన్న ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఆ బాలుడి ద్వారా గర్భం దాల్చింది. అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో ఈ ఘటన జరిగింది. బ్రిట్నీ గ్రే అనే మహిళ ఏడాదిగా 14 ఏండ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. గత ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి, పిల్లల హాట్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఆ బాలుడితో శృంగారం ద్వారా బ్రిట్నీ గ్రే గర్భం దాల్చినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఈ నెల 1న గ్రేను అరెస్ట్‌ చేశారు. ఆమె 5 వేల డాలర్ల బాండు సమర్పించడంతో గురువారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 23న కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుందని, అప్పుడు ఆమె హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement